మార్కాపురం బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | YS Jagan Mohan Reddy is deeply shocked over the Markapuram bus tragedy | Sakshi
Sakshi News home page

మార్కాపురం బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Mar 26 2026 8:15 AM | Updated on Mar 26 2026 10:52 AM

YS Jagan Mohan Reddy is deeply shocked over the Markapuram bus tragedy

సాక్షి,తాడేపల్లి: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన‌ వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ఘోర ప్రమాదానికి గ‌ల‌ కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేసి బాధ్యుల‌పై కఠిన చర్యలు తీసుకోవాల‌ని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. 

 


అంతకుముందు బస్సు ప్రమాదంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైఎస్‌ జగన్‌ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement