రెండు వారాల వ్యవధిలో
భారీగా పెరిగిన ధరలు
యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిన నూనెల ధరలు
లీటర్‌పై రూ.20 నుంచి 50 వరకు పెంపు
కృత్రిమ కొరత సృష్టించి, సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
లీటర్ ఉండాల్సిన పరిమాణంలో 850 నుంచి 750 గ్రాములకు తగ్గింపు
నిద్రావస్థలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖల అధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: వంట గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను వంట నూనె ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటిట్లో గుబులు రేపుతోంది. రెండు వారాలకు ముందు వరకు సాధారణంగా ఉన్న వంట నూనెల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ నూనైపె ఒక్కసారిగా రూ.20 నుంచి రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇదే కాకుండా వివిధ బ్రాండ్లకు చెందిన వంట నూనె ధరలు లీటర్‌కు ఏకంగా రూ.60 నుంచి రూ.80కు సైతం పెరిగాయి. హోల్‌సేల్ సూపర్‌బజార్లు, ఆన్‌లైన్ హోమ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలోనూ అధిక ధరలు కొనసాగుతున్నాయి.
యుద్ధం పేరుతో ధరలకు రెక్కలు
వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వంటనూనెల సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా దిగుమతులు తగ్గి మార్కెట్‌లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం పన్నులు సైతం వట నూనెల ధరలు పెరగడానికి మరో కారణమైంది. ఉగాది పండుగ మొదలు మార్కెట్లో వంటనూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకు చూపి స్థానిక వ్యాపారులు వినియోగదారులపై నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు గోదాముల్లో స్టాకును బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెరిగేందుకు కారకులవుతున్నారు. అదే విధంగా తక్కువ ధరకు కొనుగోలు చేసిన నూనె ప్యాకెట్లు, డబ్బాలను ప్రస్తుతం నెలకొన్న డిమాండ్‌తో ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలో రోజుకు రూ.50వేల లీటర్లకు పైగా నూనె వినియోగం
తగ్గిపోయిన పరిమాణం...
నూనె రకం గతంలో ధర ప్రస్తుత ధర
(లీటర్) ( లీటర్)
పామాయిలు 90–115 20–160
సన్‌ఫ్లవర్ ఆయిల్ 140–155 160–180
వేరుశనగ నూనె 130–150 170–190


