సాక్షి, తిరుపతి: జిల్లాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఒస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 25 మంది ప్రయాణికులతో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. పెళ్లకూరు మండకం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు.


