సింగరాయకొండలో రోడ్డు ప్రమాదం

Private Travel Bus Rollover At Singarayakonda In Prakasam District - Sakshi

సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగుళూరు నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top