దేశంలో 5... దక్షిణాదిలో 2 | Telangana ranks fifth in the country in accident blackspots | Sakshi
Sakshi News home page

దేశంలో 5... దక్షిణాదిలో 2

Feb 12 2026 4:40 AM | Updated on Feb 12 2026 4:40 AM

Telangana ranks fifth in the country in accident blackspots

యాక్సిడెంట్‌ బ్లాక్‌స్పాట్స్‌లో మన పరిస్థితి ఇదీ..

జాతీయ రహదారులపై జాబితా ఆధారంగా 1,535 గుర్తించిన కేంద్రం

హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల సైతం ఎక్కువే

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై పదేపదే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్‌ రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ జా­బి­తాలో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉండగా... దక్షిణాదిలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి­త్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) గణాంకాలు దీన్ని నిర్ధారిస్తున్నాయి. గత వా­రం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ జాబితాను ఆ శాఖ సభ ముందు ఉంచింది. 

దాని ప్రకారం 2024–25 గణాంకాల ఆధా­రంగా తెలంగాణ మీదుగా వెళ్లే జాతీయ రహదారుల్లో 1,535 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నాయి. ఈ జాబితాలో 2,210 బ్లాక్‌స్పాట్లతో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే మొ­దటిస్థానంలో ఉంది. దక్షిణాదికి సంబంధించి 1,661 స్పాట్స్‌తో తమిళనాడు మొదటి స్థానంలో, దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 1,535 స్పాట్స్‌తో తెలంగాణ దేశంలో ఐదు, దక్షిణాదిలో రెండో స్థానం ఆక్రమించగా... ఆ తర్వాత 1,407తో పంజాబ్, 1,339తో పశ్చిమ బెంగాల్‌ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 

ఆ బ్లాక్‌స్పాట్స్‌పై సమగ్ర అధ్యయనం చేసిన మంత్రిత్వ శాఖ మైనర్, మేజర్‌ మరమ్మతుల్ని ప్రతిపాదించింది. మైనర్‌ మరమ్మతుల్లో 80 శాతం వరకు పరిష్కారం కాగా... మేజర్‌ మరమ్మతులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా ఆయా బ్లాక్‌ స్పాట్స్‌ అనేక ప్రాణాలను బలిగొంటున్నాయని ఎంఓఆర్‌టీహెచ్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రాష్ట్రంలో సగం కూడా పూర్తి కాలే...
బ్లాక్‌స్పాట్స్‌ నిర్మూలన కోసం ఎంఓఆర్‌టీహెచ్‌ సూచిస్తున్న మేజర్‌ మరమ్మతు­ల్లో జంక్షన్ల పునర్నిర్మాణం, గ్రేడ్‌ సెపరేటర్ల అమలు, సర్వీస్‌ రోడ్ల నిర్మాణం తది­తరాలు ఉంటున్నాయి. ఇవన్నీ భూ సేకరణ, డిజైన్‌ మార్పు ఆమోదం, నిధు­ల సమీకరణ తదితర అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఫలితంగా ఎక్కడా సగం కూడా పూర్తికావట్లేదు. రాష్ట్రంలో గుర్తించిన 1,535 బ్లాక్‌ స్పాట్లలో కేవలం 516 ప్రాంతాల్లోనే (33.6 శాతం) మరమ్మతులు జరిగాయి. కర్ణాటక, హిమాచల్‌­ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల్లో సగం వరకు ఈ మరమ్మతులు జరిగాయి. 

రాజధానిలోనే మొత్తం 54 స్పాట్స్‌...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,535 బ్లాక్‌స్పాట్స్‌లో హైదరాబాద్‌తో పాటు చుట్టు­పక్కల ప్రాంతాల్లోనే 54 ఉన్నాయి. నాగ్‌పూర్‌– హైదరాబాద్‌– బెంగళూరు మధ్య ఉన్న ఎన్‌హెచ్‌–44పై బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, చిల్డ్రన్స్‌ పార్క్, పూరా­నాç­³Nల్, జూపార్క్‌ ప్రాంతాలు, ఎన్‌హెచ్‌–63లో చాదర్‌ఘాట్‌–­భూపాల­పట్నం మధ్య ఉన్న నింబోలిఅడ్డా, కాచిగూడ ఓల్డ్‌ ట్రాఫిక్‌ ఠాణా, త్రిశూర్‌ బా­ర్‌–రామంతాపూర్‌ మధ్య ప్రాంతాలు ఉన్నాయి. 

పుణే–హైదరాబాద్‌–­విజ­య­వాడ మధ్య ఉన్న ఎన్‌హెచ్‌–65లోని ఎస్సార్‌నగర్, పంజగుట్ట, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట... ఎన్‌హెచ్‌–765లోని చాంద్రాయణగుట్ట–­కేశ­వ­­గిరి జంక్షన్‌ మధ్య ప్రాంతాల్లో ఈ బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నాయి. ప్రధానంగా ఫ్లైఓవర్లు, వాటి అప్రోచ్‌ రోడ్లు, అండర్‌ పాస్‌లు, చెక్‌పోస్టులు, టోల్‌ ప్లాజాలున్న ప్రాంతా­లు, భారీ మలుపుల వద్దే ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement