ఓటమి భయంతోనే దౌర్జన్యకాండ: కేటీఆర్‌ | Harish Rao and KTR fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే దౌర్జన్యకాండ: కేటీఆర్‌

Feb 12 2026 4:20 AM | Updated on Feb 12 2026 4:20 AM

Harish Rao and KTR fires on Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల లోనే ఘోరమైన పాలనా వైఫల్యాలు మూటగట్టుకు న్న సీఎం రేవంత్‌ రెడ్డి ఓటమి భయంతో మున్సిపల్‌ ఎన్ని కల్లో దౌర్జన్యకాండకు దిగార ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణ ఎన్నికల్లోనూ తప్పదనే ఆందోళన తోనే రేవంత్‌ అడుగడుగునా అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల రూపాయలతో ప్రజాతీర్పు నే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో బుధవారం కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీఆర్‌ఎస్‌ శ్రేణు లపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్‌రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం నిరంతరం కొనసాగుతుంది’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ‘ఎన్నిక ల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వీరో చితంగా పోరాడారు. వారు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది’అని కేటీఆర్‌ కొనియాడారు. 

దాడులు చేయడం హీనమైన సంస్కృతి
ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో అడుగడుగునా అధికార దుర్వినియో గాని కి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డా రని మాజీ మంత్రి హరీశ్‌రా వు విమర్శించారు. ‘నామినే షన్ల దాఖలు మొదలు పోలింగ్‌ ముగిసేంత వరకు కాంగ్రెస్‌ అనేక అరాచకాలకు పా ల్పడింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థు లను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిద ర్శనం. 

చట్టాన్ని కూడా లెక్క చేయ కుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడు గులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబ డటం ప్రజాస్వామ్య వ్యవస్థ ను అవమానించడమే. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు’అని హరీశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement