బస్సు దిగేసిన ప్రయాణికులు
భయపడి దిగిపోయిన ప్రయాణికులు
పొదలకూరు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణానికి సమీపంలోని మర్రిపల్లి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం మేరకు.. పొదలకూరు పట్టణంలోని బస్టాండ్ నుంచి సాయి సింధూ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరుకు బయలుదేరింది.
రెండు కి.మీ. దూరంలోని మర్రిపల్లి వద్దకు చేరుకునే సరికి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు భయపడి కిందకు దిగేశారు. కొందరు మరో బస్సులో వెళ్లగా, మరికొందరు దగ్గరలోని బంధువుల ఇళ్లకు వెళ్లారు.


