రైలు పట్టాలపై వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొందో? లేదా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. విజయమహాల్‌గేటు సమీప రైలు పట్టాలపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి కుడిచేయి తెగి, ఎడమచేయి, కాళ్లు విరిగిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. అతని వయసు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. బ్లూ రంగు చొక్కా, బూడిద రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.


