అమరజీవికి నివాళులర్పించిన కాకాణి
నెల్లూరు రూరల్: నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలనే ప్రజల దశాబ్దాల కల నెరవేరలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం స్మరించుకునేలా చేశారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరజీవి బాటలో నడుస్తూ పేదల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జగన్ సుపరిపాలనను రాష్ట్ర ప్రజలందరూ తిరిగి కోరుకుంటున్నారన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులందరూ కలిసి పనిచేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


