రేషన్ బియ్యం స్వాహాపై కొలిక్కిరాని విచారణ
ఉదయగిరి: స్థానిక పౌరసరఫరాల గోదాములో రూ.కోటి విలువజేసే సరుకుల మాయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సివిల్ సప్లయ్స్ జిల్లా డీఎం అర్జున్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అందులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా విచారణ జరుగుతున్నా, పూర్తి వివరాలను ఇప్పటికీ వెల్లడించలేదు. కాలయాపన చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో నిందితులను కోర్టులో బుధ, గురువారాల్లో హాజరుపర్చే అవకాశం ఉందని సమాచారం. బియ్యం మాయం వెనుక జిల్లా డిపోలో పనిచేసే ఓ టెక్నికల్ పర్సన్‌తో పాటు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ బియ్యం అక్రమ రవాణా వ్యాపారి హస్తం ఉందనే అంశం విచారణలో వెల్లడైందనే ప్రచారం జరుగుతోంది.
ఎస్‌ఈఐఎల్ ఎనర్జీకి సెక్యూరిటీ ఎక్సలెన్స్ అవార్డు
తోటపల్లిగూడూరు: దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ సంస్థయిన ఎస్‌ఈఐఎల్ ఎనర్జీకి ఉత్తమ సెక్యూరిటీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫైర్ అండ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అవార్డును అందుకున్నామని సీఈఓ జన్మేజయ మహాపాత్ర తెలిపారు.
రాజకీయ పార్టీల
ప్రతినిధులతో సమావేశం
నెల్లూరు(దర్గామిట్ట): ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించనున్నామని డీఆర్వో విజయ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వే చేసి వివరాలను సేకరించి, ఆపై పార్టీల ప్రతినిధులకు వివరించనున్నామని చెప్పారు. ఓటర్ల లి స్టులో డోర్ నంబర్లుండేలా చూడాలని పలువు రు కోరారు. వివిధ పార్టీలకు చెందిన రాజేష్, శ్రీనివాసులు, శ్రీరామ్, మాదాల వెంకటేశ్వర్లు, దయాకర్, సంజయ్‌కుమార్, సుధాకర్, రసూల్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 70,251 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,862 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
అడవుల్లో ముగిసిన
జంతు గణన
ఉదయగిరి రూరల్: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని అడవుల్లో చేపట్టిన జంతు గణన మంగళవారంతో ముగిసిందని రేంజ్ అధికారి కుమార్‌రాజా తెలిపారు. 13 బీట్లలో 45 వేల ఎకరాల విస్తీర్ణంలో జంతు గణనను చేపట్టామని చెప్పారు. జంతువుల పాదముద్రలు తదితరాలను సేకరించామని వివరించారు. వీటిని యాప్‌లో నమోదు చేసి, వివరాలను బయో ల్యాబ్‌కు పంపనున్నామని వెల్లడించారు.
రేషన్ బియ్యం స్వాహాపై కొలిక్కిరాని విచారణ
రేషన్ బియ్యం స్వాహాపై కొలిక్కిరాని విచారణ


