18న మేయర్ స్థానంపై స్పష్టత
● అప్పటి వరకు ఇన్‌చార్జి మేయర్‌గా రూప్‌కుమార్‌యాదవ్
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంపై 18న స్పష్టత రానుంది. శనివారం రాత్రి స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, తన ప్రతినిధి ద్వారా రాజీనామా లేఖను కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. మేయర్ రాజీనామా విషయాన్ని కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎన్నిక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిర్దేశాల మేరకు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్‌కు ఇన్‌చార్జి మేయర్‌గా బాధ్యతలను అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెల 18వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సమావేశం జరిగే వరకు రూప్‌కుమార్ ఆ స్థానంలో కొనసాగుతారు. ఇదే సమమావేశంలో మేయర్ రాజీనామాను కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారికి నివేదికను అందజేస్తారు. ఎన్నికల అధికారి పరిశీలించి తదుపరి కొత్త మేయర్ ఎన్నికపై నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంటుంది. అప్పటి వరకు ఇన్‌చార్జి మే యర్‌గా రూప్‌కుమార్‌ను కొనసాగించే విషయంలో మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


