- ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమం
- ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణ
- కూటమి ప్రభుత్వ పాలనా విధానాలపై వ్యతిరేకతకు ఇదే నిదర్శనం
- వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి
- వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
తాడేపల్లి : మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా ఈరోజు(డిసెంబర్చే 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్
ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమం
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.
ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణ
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్‌గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.
The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025
ఇవీ చదవండి:


