breaking news
Koti Santhakala Sekarana
-
చంద్రబాబుకు బిగ్ షాక్!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది. మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.వివరాల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో టెండర్లను పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అయితే, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే సింగిల్ బిడ్ దాఖలైంది. కాగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెండర్లు గడువు పెంచింది. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుండి ఉద్యమ బాట పట్టిన వైఎస్సార్సీపీ.. కోటి సంతకాల సేకరణతో పతాక స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ..అంతకుముందు.. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. ఎక్స్‌లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్‌లో మద్దతు వెల్లువెత్తింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇది బట్టబయలు చేసింది.వైఎస్ జగన్ సంకల్పం..పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి జిల్లా కేంద్రాలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని గవర్నర్‌కు అందజేశారు. -
YS Jagan: నీకు చేతకాకపోతే వదిలేయ్ అయ్యా నేను చూసుకుంటా..
-
లోక్ భవన్ కు YS జగన్.. బాబు, పవన్ గుండెల్లో వణుకు
-
చేతకాకపోతే దిగిపో..నేను చూసుకుంటా..!
-
‘ఎక్స్’ టాప్ ట్రెండింగ్‌లో..
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణు వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎక్స్‌లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్‌లో మద్దతు వెల్లువెత్తుతోంది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను బట్టబయలు చేసింది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే..చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. -
చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ అల్టిమేటం
ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్ అని.. అలాంటి స్కామ్‌ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్‌ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్ అల్టమేటం జారీ చేశారు. -
సొంతూరిలో చంద్రబాబుకి షాక్!
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరిలోనే ఆయనకు షాక్ తగిలింది. ఆయన తీసుకున్న పీపీపీ విధానాన్ని ఆ ఊరి ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఈ ఊరి ప్రజలూ భాగం కావడం గమనార్హం.వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించారు. అందులో ఏడు పూర్తి చేయగా.. మరో 10 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈలోపు కూటమి ప్రభుత్వం జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో వాటిని అలాగే వదిలేసింది. అటుపై.. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైఎస్సార్సీపీ. తుపాను, వర్షాల్లోనూ రెండు నెలలపాటు రాష్ట్రమంతటా ఉవ్వెత్తున సాగింది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా.. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ ప్రజలు సంతకాలు చేశారు. అయితే.. తమ ఊరి నుంచి ఎలాంటి సంతకాలు చేయలేదని నారావారిపల్లె టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటనలు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ రచ్చబండలో భాగంగా అక్కడా సంతకాల సేకరణ జరిగింది. ఆ పత్రాలు అక్కడి నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి.. అక్కడి నుంచి తిరుపతికి.. అక్కడి నుంచి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నాయి. ఈ లెక్కన.. సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ సమర్పించబోయే చంద్రబాబు వ్యతిరేక ప్రజా గళాల్లో ఆయన సొంతూరి ప్రజలది కూడా ఉండబోతుందన్నమాట. -
కోటి సంతకాల సేకరణ ప్రతులను గవర్నర్‌కు అందజేశాం: వైఎస్ జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ.. -
కోటి గళాలను పక్కదోవ పట్టిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవెటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి కోటి గొంతుకలు మద్దతిస్తూంటే.. ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. ఇదే అదనుగా ఎల్లోమీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పడుతున్న పాట్లు ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎల్లోమీడియా కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకుంటూండటం గమనార్హం. ఎల్లోమీడియా ప్రతినిధి ఈనాడు అకస్మాత్తుగా వైద్యకళాశాలల నిర్వహణపై పీపీపీ విధానమే మేలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందంటూ ఒక భారీ కథనాన్ని ప్రచురించింది. సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పాట అందుకున్నారు. కమిటీ సిఫారసులేమిటన్నది కాసేపు పక్కనబెడదాం. అసలు చంద్రబాబుకు ఇలాంటి కమిటీలపై నమ్మకం ఉందా? మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది ఈ చంద్రబాబే కదా? ఈనాడు ఈ రకంగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే... ఆంధ్రజ్యోతి వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజా మద్దతు పెద్దగా లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. దీన్ని బట్టి మరోసారి స్పష్టమైన విషయం ఏమిటంటే... చంద్రబాబుకు కష్టం కలిగిన ప్రతి సందర్భంలోనూ కాపు కాసేందుకు ఈ ఎల్లో పత్రికలు రెండూ తమదైన డ్రామాను తెరమీదకు తెస్తాయి అని!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించారన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సాధించిన కళాశాలలు కేవలం 12 మాత్రమే. కానీ ఎకాఎకిన 17 కాలేజీలకు అనుమతి సాధించిన జగన్‌ను పచ్చ మీడియా, తెలుగుదేశం నేతలు ఎన్నడూ అభినందించిన పాపాన పోలేదు. పైపెచ్చు తప్పుడు ప్రచారాలు ఆరంభించారు. జగన్ ఈ కాలేజీల సమర్థ నిర్వహణ కోసం ఎన్నారై కోటా కింద నిర్దిష్ట ఫీజులు నిర్ణయిస్తే ఇదే టీడీపీ, జనసేనలు తీవ్ర విమర్శలకు దిగాయి. సీట్లు అమ్ముకుంటారా తెగ బాధపడిపోయాయి. బాబు గారి తనయుడు లోకేశ్ యువగళం కార్యక్రమాల్లో మాట్లాడుతూ సీట్లు అన్నింటిని ప్రభుత్వమే కేటాయిస్తుందని, బి కేటగిరి కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉండబోవని హమీ ఇచ్చారు. చంద్రబాబు సైతం అదే చెప్పారు కానీ అధికారం రాగానే మాట మార్చేశారు. ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి రెడీ అయ్యారు. అదేమని అడిగితే ఇవి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి కానీ ప్రైవేటు వారు నడుపుతారంటూ బుకాయించడం ఆరంభించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అదే టైమ్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదును భారీగా పెంచేశారు. ప్రభుత్వం ప్రతి కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూమిని, ఇప్పటికే సాగిన నిర్మాణాలను ప్రైవేటు సంస్థలకు, అవి కూడా వారి తైనాతీలకు కట్టబెట్టడానికి రంగం సిద్దం చేశారు. పైగా జగన్ టైమ్‌లో అసలు కాలేజీలు రానట్లు తప్పుడు ప్రచారం చేయాలని కూడా ఆలోచించి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు వంటివారు కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించి ఆశ్చర్యం కలిగించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనంలోకి వెళ్లారు. ఆయా చోట్ల జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, అలాగే వైసీపీ బృందాలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేశారు. తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లినప్పుడు వచ్చిన అనూహ్య స్పందన రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి రకరకాల దశలలో ఈ ఉద్యమాన్ని ఒక క్రమబద్దంగా సాగించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకురావడానికి ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ క్యాడర్‌కు కూడా ఒక ఊపు, ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రతిపక్షంగా ప్రజలలో గట్టిగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వ పెద్దలకు కంగారు ఏర్పడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని రక్షించేందుకు, ప్రజలలో ప్రభుత్వ కాలేజీలపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు ఆరంభించింది.అయినా ప్రజలలో ఈ అంశంపై ఆగ్రహం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈనాడు మీడియా కొద్దిరోజుల క్రితం ‘పీపీపీ విధానమే మేలు’ అన్న శీర్షికతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. వివిధ శాఖలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఆయా అంశాలపై చర్చలు జరిపి కొన్ని సిఫారసులు చేస్తుంటాయి. అవేవి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయాలుగా చూడరు. ఈ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకున్న సందర్భాలు అరుదు. రాష్ట్రాలలో కూడా శాసనసభ కమిటీల సిఫారసుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఒక కోణం అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని సూచించిందా? అంటే లేదు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల అవసరం ఉంటే ప్రైవేటు వారిని కూడా భాగస్వాములు చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప ప్రభుత్వ కాలేజీలు వద్దని కాని, ప్రభుత్వ కాలేజీల కోసం కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలను ప్రైవేటు వారికి దోచిపెట్టవచ్చని కాని ఎక్కడా సిఫారసు చేయలేదు. ఒక్కో కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూములను ఎకరా రూ.వందకు లీజుకు ఇవ్వాలని, అది కూడా 66 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈనాడు మీడియా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానానికి స్టాండింగ్ కమిటీ మద్దతు ఇచ్చిందేమో అన్న అభిప్రాయం కలిగించాలని కుట్రపూరితంగా ఈ కథనం ఇచ్చింది. అందుకే వైసీపీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, సిదిరి అప్పలరాజు తదితరులు చంద్రబాబు జేబు సంస్థ మాదిరి ఈనాడు మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే ఈనాడు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ సిఫారసులు చేయలేదని, భవిష్యత్తులో వచ్చేవాటికి అని రాసి ఉండేది. ఆ పని చేయలేదు. ప్రతి దానికి సొంత భాష్యం ఇచ్చి వైసీపీపై విషం కక్కే ఎల్లో మీడియా ఈ కమిటీ సిఫారసులకు ఉన్న విలువ ఏమిటి? కేంద్రం వీటిలో ఎన్నిటిని పట్టించుకుంటుంది? ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యకాలేజీలు ఎలా నడుస్తున్నాయి. పేదలకు ఏ మేరకు ఉచిత వైద్యం అందుతున్నది? ప్రభుత్వ కాలేజీలలో ఉండే లాభనష్టాలు మొదలైన వాటిని విశ్లేషించి ఉంటే ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పినట్లయ్యేది. అవేవి చేయకుండా ప్రజలను మభ్య పెట్టి, కోటి సంతకాల ఉద్యమంపై నీళ్లు చల్లే ఉద్దేశంతో కథనం రాయడంపై వైసీపీ మండిపడింది. దేశంలో కొత్తగా 75 వేల వైద్య విద్య సీట్లు పెంచడం కోసం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నది వాస్తవం. వైద్య కళాశాలలు లేని జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త కాలేజీలు ఏర్పాటు కావాలని కమిటీ అభిప్రాయపడింది. జగన్ తన హయాంలో చేసింది కూడా అదే కదా! కేంద్రం కూడా ప్రభుత్వరంగంలోనే వైద్యకాలేజీలు మంజూరు చేసింది తప్ప పీపీపీ విధానంలో కాదు. బహుళజాతి సంస్థలకు, వేల కోట్ల రూపాయల లాభార్జన చేస్తున్న సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు ప్రయోజనం కలిగించే వైద్య కాలేజీలకు ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రైవేటువారికే సంపదగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా గళం విప్పడం అభినందనీయం అని చెప్పాలి. ఎల్లో మీడియా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లు కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటి సంతకాల పేపర్లతో గవర్నర్ ను కలవనున్న జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
-
అడ్డంకులను అధిగమించి.. అణచివేతను ధిక్కరించి
సాక్షి, అమరావతి : ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు.. చెక్‌పోస్టులతో అడ్డగింతలు.. పోలీసులకు ఆదేశాలు.. భగ్నం చేసేందుకు పన్నాగాలు..! ఇదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు చేసిన కోటి సంతకాలతో సోమవారం వైఎస్సార్సీపీ నాయకత్వం, శ్రేణులు నిర్వహించిన ర్యాలీలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు. కానీ, ప్రజలు వీటిన్నిటినీ దాటుకుంటూ ర్యాలీల్లో అశేషంగా పాల్గొన్నారు. కిలోమీటర్ల కొద్దీ దండుకట్టి సర్కారు దుర్మార్గంపై దడపుట్టించారు. నిర్బంధాలను ఛేదిస్తూ, అడ్డంకులను దాటుకుంటూ విజయవంతం చేశారు.వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపైంది. దీంతో ఎలాగైనా భగ్నం చేయాలని కుట్రలు పన్నింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ ర్యాలీలను నిలువరించాలని జిల్లా ఎస్పీ... సీఐ, ఎస్ఐలకు గట్టిగా చెప్పారు. దీంతో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ⇒ ఇచ్ఛాపురంలో జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మండపామ్ టోల్ గేట్ వద్ద మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త పేరాడ తిలక్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టోల్ గేట్ నుంచి నిరసన ర్యాలీ తీశారు. ⇒ వేలాదిమందితో ఆమదాలవలసలో సమన్వయకర్త చింతాడ రవికుమార్ నిర్వహించిన ర్యాలీని పోలీసులు మూడుచోట్ల అడ్డుకున్నారు. ⇒ శ్రీకాకుళం అరసవల్లి జంక్షన్లో నరసన్నపేట నాయకులతో వస్తున్న ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు.⇒ విజయనగరం జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిర్బంధం విధించినా ప్రజలు లెక్కచేయలేదు. ⇒ ఏలూరులో నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ చేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ, పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో దూరాన్ని కుదించారు. ⇒ కర్నూలులో పోలీసులు ఏకంగా నోటీసులు జారీచేసి అడ్డుకోవాలని చూశారు. కానీ, వీటిని లెక్కచేయకుండా ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ముక్కోటి గొంతుకలతో వ్యతిరేకించారు. ర్యాలీలతో కదంతొక్కారు. -
కోటి సంతకాల ఉద్యమం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయమైందని.. చారిత్రాత్మకంగా నిలిచిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయన్నారు.ఈ ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ‘సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను పణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, కోటిమందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడినుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్‌కు సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగ అధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన యత్నాన్ని, నిర్ణయాలను, ఆయన పాలనను కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’’. -
‘ఇది బాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన ఘనమైన తీర్పు’
తాడేపల్లి : మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా ఈరోజు(డిసెంబర్చే 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమంప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్‌గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025 ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇదీ కదా ప్రజా ఉద్యమం అంటే.. -
Vizag: డాన్సులు, స్టెప్పులతో పోటెత్తిన జనం
-
చంద్రబాబు బిత్తరపోయేలా.. YSRCP భారీ బైక్ ర్యాలీ..
-
బ్రోకర్లకి,నీ చెంచాల చేతిలో మెడికల్ కాలేజీలు పెడతా అంటే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
150 కార్లతో కోటి సంతకాల ర్యాలీ దద్దరిల్లిన చిత్తూరు
-
MLC KRJ Bharath: జగన్‌ను సీఎం చేసే వరకూ ఈ ఉద్యమం ఆగదు
-
YSRCP Leaders: ప్రతి కుటుంబం చంద్రబాబు నిర్ణయాన్ని ఛీ కొడుతుంది
-
వైఎస్సార్సీపీ పోరుబాట.. ‘కోటి సంతకాల’ ప్రతులతో భారీ ర్యాలీ (ఫొటోలు)
-
‘రెడ్‌బుక్’ పాలన తప్ప.. ప్రజా పాలన ఏదీ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు. -
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్‌పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం.. వైఎస్సార్సీపీ పోరాటం.. తుది అంకానికి చేరుకున్నాయి.. -
15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు...వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం...పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. -
ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు. -
వైద్యం ప్రైవేటీకరణపై ‘కోటి’ గళాలు!
చంద్రబాబు పాలనపై ప్రతిఘటన యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కలం కలం కలిసి కోటి గళాల స్వరంగా మారింది. వైద్యం ప్రైవేటీకరణపై కోటి గళాలు ఏకమై చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఊరూ వాడా ఏకమై కదులుతుంది. ఏపీలో వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, అది ప్రజల సమిష్టి ప్రతిఘటన. చంద్రబాబు పాలనపై రణభేరీ అంటే సరిగ్గా సరిపోతుందేమో. కలం కలం కలిసి.. ప్రజా గళంగా మారి..ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయం అనంతరం వైఎస్సార్సీపీ కోటి సంకతాల సేకరణకు పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ పిలుపు ఇచ్చింది మొదలుకొని ప్రజా సమర సంతకం ఒక్కొక్కటిగా ఊపిరి పోసుకుంది. అది కోటికి పైగా సంతకాల సేకరణతో నిలువెత్తు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రేవేటుపరం కాకుండా చూడాలని తమ సంతకంతోనే సమాదానం చెప్పారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతారా.. లేదా అని ప్రశ్నించడమే కాదు.. కచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం.. కోటి సంతకాలు.. కానీ..వైఎస్సార్సీపీ నిర్దేశించుకున్న లక్ష్యం కోటి సంతకాలు. కానీ ఆ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది. కోటి సంతకాలతో లక్ష్యం పూర్తయినా, జనం నుంచి స్పందన వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కోటి సంతకాల సంఖ్య దాటిపోయింది. దీనికి ప్రజలు విస్తృతంగా మద్దతు తెలపడంతో కోటి సంతకాల సేకరణ కాస్తా కోట్లాడి గళాల నిరసనగా రూపాంతరం చెందింది. కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ కార్పొరేట్ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా స్వరం.. సంతకాల రూపంలో ఉద్యమించింది. ప్రతిఘటనగా మారి..వైఎస్ జగన్ తన హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి, 5లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.- ఇప్పుడు వాటిని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తుంది. వైద్య విద్యను అత్యంత కాస్ట్లీగా మార్చాలనే చంద్రబాబు ప్రయత్నాన్నిప్రజా ఉద్యమంతోనే తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ భావించింది. ఆ క్రమంలోనే కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఇది అత్యంత విజయవంతమై జనసంద్రంగా మారింది. అయితే ఈ అంశంపై 18వ తేదీన గవర్నర్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. ప్రజల స్పందనను గవర్నర్ ముందుకే తీసుకుపోనున్నారు వైఎస్ జగన్. ర్యాలీలు, సమావేశాలు..కోటి సంతకాల సేకరణ అనంతరం గ ప్రజా ఉద్యమం పత్రాలను జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. నిన్న(బుధవారం, డిసెంబర్ 10వతేదీన) ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విజయవంతంగా జరిగింది. సుమారు అన్ని జిల్లా పార్టీ కేంద్రాలయాకు ఈ ప్రతులు చేరిపోయాయి. 15వ తేదీన విజయవాడకు వీటిని తరలించనున్నారు. ఆపై 18వ తేదీన గవర్నర్‌ను వైఎస్ జగన్ కలవనున్నారు. మొత్తంగా, "కోటి సంతకాల ఉద్యమం" ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ, బాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటనగా మారింది. బాబు పాలనపై వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ, ఈ ఉద్యమాన్ని ప్రజా శక్తి ప్రదర్శనగా మలచింది. గవర్నర్‌కు సంతకాలు సమర్పించిన తర్వాత, ఈ ఉద్యమం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా ‘కోటి’ గళాల గర్జన...
-
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్‌కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్‌కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్‌లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్‌కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్‌లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల ఉద్యమం.. కోటి మంది గుండె చప్పుడు: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని.. ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్సార్సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు. చివరికి మంత్రి సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించారు. గత వైయస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని విడదల రజని వివరించారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిజిటలైజ్ చేసి ఆ రికార్డులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైయస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైయస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైయస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైయస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇచ్చిన ఈ పిలుపునకు ప్రజలు భారీగా తరలి వచ్చి సంతకాలతో మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు.ఫేక్ సభ్యత్వాలు, ఫేక్ పెట్టుబడులు, ఫేక్ సూపర్ సిక్స్ కాదులోకేష్ చెప్పే టీడీపీ ఫేక్ సభ్యత్వాలు మాదిరిగా కాకుండా, చంద్రబాబు ప్రకటించే ఫేక్ పెట్టుబడుల ఒప్పందాల మాదిరిగా కాకుండా, సూపర్ సిక్స్ ఫేక్ హామీల మాదిరిగా కాకుండా ప్రజలు స్పష్టంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా పేపర్లపైన చేసిన సంతకాలు. కిక్ బ్యాగ్స్ కోసం పేద విద్యార్థుల మెడికల్ సీటు కలను పణంగా పెడుతూ, వైద్యాన్ని పేదలకు అందని ద్రాక్షగా మారుస్తూ జరుగుతున్న కుట్రలను గుర్తించిన ప్రజలు ప్రైవేటీకరణ వద్దని నినదిస్తూ ప్రభుత్వానికిచ్చిన మెమోనే ఈ కోటి సంతకాలు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేసింది. 108, 104 అంబులెన్స్‌లు కనుమరుగు చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసేసింది. బిల్లులు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎకరా వంద రూపాయల చొప్పున మెడికల్ కాలేజీల భూములను అప్పనంగా ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతిటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్పత్రులను వారికే ఇచ్చేసింది. అందులో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు చేస్తున్న ధన యజ్ఞాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. దానికి సాక్ష్యమే వైయస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు వచ్చిన అపూర్వ స్పందన. ప్రైవేటీకరణ నిర్ణయం చాలా గొప్పదన్నట్టు కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం ఆపేస్తే మంచిది. ఇప్పటికైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి.గవర్నర్‌కి డిజిటల్ రికార్డులు సమర్పిస్తాంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసిన వైయస్సార్సీపీ శ్రేణులందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతాభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10న రచ్చబండ పేరుతో ప్రతి గ్రామంలో మొదలైన కోటి సంతకాల ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువత, మేథావులు, వివిధ రంగాల నిపుణులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా చేయాలనుకుంటే అంతకుమించి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన రెండు నెలలుగా స్టాప్ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో చర్చలు జరుపుతూ నష్టాలను వివరిస్తూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అవగాహన కల్పించారు. తమకు ఎదురైన అనుభవాలను పార్టీ నాయకులు మీడియాకు వివరించడం కూడా జరిగింది. 26 జిల్లాల్లో ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక బాక్సుల్లో జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి నేతృత్వంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కి సమర్పించడం జరుగుతుంది. ప్రజలే తమ పేరు నియోజకవర్గం, గ్రామం, మొబైల్ నంబర్, సంతకాలను పేపర్లపై పొందుపరిచారు. ఈ మొత్తం సంతకాలను డిజిటలైజ్ చేసి గవర్నర్‌కి అందించడం జరుగుతుంది. కోటి మంది ప్రజల గుండె చప్పుడుగా ఈ కోటి సంతకాలను ప్రభుత్వం పరిగణించి పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజా నిర్ణయాన్ని కాదని ముందుకెళితే ఈ కోటి సంతకాలు ప్రభుత్వం పతనానికి శాసనంగా మారతాయని వైయస్సార్సీపీ హెచ్చరిస్తుంది. నియంత పాలనకు మూల్యం చెల్లించక తప్పదుప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మంత్రి స్వయంగా చెప్పాడంటే వైద్యారోగ్య రంగం నిర్వీర్యం అయిందని ప్రభుత్వమే అంగీకరించినట్టు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వైద్యారోగ్య రంగాన్ని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ లక్ష్యంగా దూది సూది కూడా అందుబాటులో లేనివిధంగా ప్రభుత్వ వైద్యశాలలను మార్చేశారు. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారబోతోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే దించేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని స్పష్టంగా చెబుతున్నా. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదని వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హిట్లర్ మాదిరిగా నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబుకి హిట్లర్‌కి పట్టిన గతే పడుతుందని విడదల రజని హెచ్చరించారు. -
18న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్‌కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు. -
కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న కూటమి కార్యకర్తలు
-
కోటి సంతకాల సేకరణ.. ఊరూ వాడా ఉద్యమ వేడి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఊరూ వాడా ఉద్యమ వేడి రగిలింది. -
చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, మేధావులు, యువత ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సంతలో సరుకులు, పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు సర్కారు తెగనమ్మడంపై ప్రజా ఉద్యమం ఎగసిపడుతోంది.రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నవంబరు 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా పేర్కొంటున్నారు.వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నేతల వెంట స్వచ్ఛందంగా తరలి వచ్చి పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు. అక్టోబరు 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత రెండు నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగింది. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాలను డిసెంబర్ 10వ తేదీకి జిల్లా కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నారు. అనంతరం 17న కోటి సంతకాలను గవర్నర్‌కు అందించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.రగిలిన సీమ..ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై రాయలసీమలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సీమలో సుమారు 32 లక్షల మేర సంతకాలను సేకరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, న్యాయవాదులు.. ఇలా అన్ని వర్గాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో తాము టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. కోటి సంతకాల సేకరణలో పాల్గొంటామని, ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న మంచి కార్యక్రమమని పేర్కొనడం గమనార్హం.ఇక వర్సిటీల్లో కూడా విద్యార్థులు భారీగా సంతకాల సేకరణలో పాలుపంచుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 8 వేల సంతకాలు చేయించారు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఇందులో భాగస్వాములు అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దీన్ని అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. జేసీ వర్గీయులు దాడులకు తెగబడటంతో వైఎస్సార్సీపీ నేతలకు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ వెరవకుండా సంతకాల కార్యక్రమంలో ప్రజలు భారీగా భాగస్వాములు కావడం బాబు సర్కారు పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చాటి చెబుతోంది.ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున..ఉత్తరాంధ్రలో ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన కేజీహెచ్ మినహా పేదలకు ఇతర వైద్య సంస్థలు అందుబాటులో లేని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అరిలోవలో విమ్స్, శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలోని అరిలోవ ప్రాంతంలో హాస్పిటల్స్ నెలకొల్పే ప్రైవేటు సంస్థలకు భూమి అందుబాటులో ఉంచుతూ హెల్త్ సిటీని ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉండగా విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అక్కడ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి.అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. పార్వతీపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రలో వైద్య విప్లవం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున జనాగ్రహం పెల్లుబుకుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు మెడికల్ విద్యతో పాటు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో 18.30 లక్షల మేర సంతకాల సేకరణను పూర్తి చేశారు. అల్లూరి, పార్వతీపురం లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనూ ఊహకు మించి స్పందన వచ్చింది.కోస్తాలో కన్నెర్ర..నెల్లూరు నుంచి గోదావరి వరకు కోస్తా జిల్లాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదంతొక్కాయి. సుమారు అరకోటి సంతకాల మేరకు కోస్తా జిల్లాల్లోనే సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులను అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో మన విద్యార్థులకు ఉచితంగా రావాలి్సన వైద్య సీట్లతోపాటు పేదలకు చేరువలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు దూరం కానున్నాయని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.కుప్పంలోనూ నిరసనలు..కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు తరలివచ్చి మరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో గత రెండు నెలలుగా పాల్గొనడం గమనార్హం. తిరుపతి జిల్లాలో సుమారు 5 లక్షల మేర సంతకాలు సేకరించగా... చిత్తూరు జిల్లాలో 4.73 లక్షల మంది కోటి సంతకాల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 108 గ్రామ సచివాలయాలు ఉండగా ఒక్కో సచివాలయం పరిధిలో వెయ్యి మంది చొప్పున సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.జీవో ఏదంటూ టీడీపీ నేతలు నవ్వుల పాలు..!గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలోనే ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. పులివెందుల, పాడేరు కాలేజీలు ఎన్నికల నాటికే ప్రారంభానికి సిద్ధం కాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించగానే.. అసలు మెడికల్ కాలేజీలు నిర్మాణమే జరగలేదంటూ టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారానికి దిగారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి... అసలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి జీవో ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించారు.జీవో ఉంటే తనకు చూపించాలంటూ సవాల్ విసిరారు. దీంతో అక్టోబరు 10వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల భవనాలను సందర్శించి జీవో కాపీని చూపించారు. దీంతో అయ్యన్నపాత్రుడు మిన్నకుండిపోయారు. మరోవైపు పెనుకొండలో మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది? అంటూ మంత్రి సవిత హడావుడి చేసి ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ పెనుకొండలో దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన భవంతులను మీడియాకు చూపించి మంత్రి సవిత అబద్ధాలను ఎండగట్టారు. ఇలా నిస్సిగ్గుగా అబద్ధాలాడి టీడీపీ ప్రజా ప్రతినిధులు అబాసుపాలయ్యారు. -
కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్పర్సన్లు, జడ్సీ వైస్ చైర్పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి సంతకాల ప్రతులను10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్‌ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి.. కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.ఇదీ చదవండి:చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్ -
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
తుది ఘట్టానికి కోటి సంతకాల ఉద్యమం: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం తుది ఘట్టంపై అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు.ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కోటి సంతకాలను జిల్లా కేంద్రాలలో ఉంచి, అక్కడి నుంచి 13న ఒకేసారి అన్ని నియోజకవర్గాల సంతకాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీగా నిర్వహించి, నాయకుల ప్రసంగాల అనంతరం కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలని చెప్పారు. అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతోపాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని తెలిపారు. -
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు.


