చంద్రబాబుకు బిగ్‌ షాక్‌! | No Tenders Received For 3 Medical Colleges Privatization In AP After YSRCP One Crore Signature Campaign | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు బిగ్‌ షాక్‌!

Dec 24 2025 8:48 AM | Updated on Dec 24 2025 10:58 AM

No Tenders Received For 3 Medical Colleges In AP

సాక్షి, విజయవాడ: చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఊహించని షాక్‌ తగిలింది. మెడికల్‌ కాలేజీలను తీసుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

వివరాల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మెడికల్‌ కాలేజీలకు పీపీపీ విధానంలో టెండర్లను పిలిచింది. ఈ టెండర్‌ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అయితే, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె  మెడికల్ కాలేజీలకు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కేవలం ఆదోని మెడికల్‌ కాలేజీకి మాత్రమే సింగిల్‌ బిడ్‌ దాఖలైంది. కాగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెండర్లు గడువు పెంచింది. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుండి ఉద్యమ బాట పట్టిన వైఎస్సార్‌సీపీ.. కోటి సంతకాల సేకరణతో పతాక స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సంస్థలు మెడికల్‌ కాలేజీల నిర్వహణకు ముందుకు రాలేదని తెలుస్తోంది. 

ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ..
అంతకుముందు.. ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్‌ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగింది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్‌లో మద్దతు వెల్లువెత్తింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. దీంతో, చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇది బట్టబయలు చేసింది.

వైఎస్‌ జగన్‌ సంకల్పం..
పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్‌ జగన్‌ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి జిల్లా కేంద్రాలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని గవర్నర్‌కు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement