Live Updates
కోటి సంతకాల సేకరణ.. ఊరూ వాడా ఉద్యమ వేడి
- సెంట్రల్ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ పూర్తి
- నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల సంతకాల సేకరణ
- సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలింపు
- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకలు సర్నాల తిరుపతి రావు
మాజీ ఎమ్మెల్యే , మల్లాది విష్ణు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు
- ప్రజల అభిప్రాయాన్ని సంతకాల రూపంలో తీసుకున్నాం
- జగన్ మోహన్ రెడ్డి నాయత్వంలో కోటి సంతకాలతో గవర్నర్ ను కలుస్తాం
- ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది
- ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూటమి విఫలమైంది
- రాష్ట్రంలోని మంత్రులు ముఖ్యమంత్రితో తిట్లు తింటున్నారు
- ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైంది
- వైఎస్ జగన్ చేసిన మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కనిపించకుండా చేస్తుంది
- ప్రజలందరూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు
- చంద్రబాబు సంపద సృష్టిస్తామనని చెప్పిన మాట తప్పారు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకూ ఉద్యమం చేస్తాం
విజయనగరం జిల్లాలో
- విజయనగరంలో కోటిసంతకాల సేకరణ
- హాజరైన మాజీ డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
- కోటిసంతకాల పత్రులతో పైడితల్లి అమ్మవారికి పూజలు
- ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించాలని పూజలు
- అమ్మవారి ఆలయం నుంచి జిల్లా కార్యాలయానికి
- బైక్ ర్యాలీగా జిల్లా కార్యాలయానికి వెళ్లిన నేతలు
- శృంగవరపుకోట: మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో కార్యక్రమం
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిరసన
- 52 వేల సంతకాల సేకరణ పూర్తి
- జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్లిన నాయకులు
- బొబ్బిలి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
- నిరసనలో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకట చిన అప్పలనాయుడు
- సంతకాల పత్రులను వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు
- పత్రుల వాహనాన్ని కార్యాలయానికి జెండా ఊపి తరలింపు
- సాలూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసన
- ప్రైవేటికరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పి. రాజన్న దొర
- రాజాం: కోటిసంతకాల సేకరణ కార్యక్రమం
- అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
- వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఇన్చార్జి తలే రాజేష్.
- కోటిసంతకాల వాహనం పార్టీ కార్యాలయానికి తరలింపు
కాకినాడ జిల్లాలో
- పిఠాపురం నియోజకవర్గంలో 50 వేల సంతకాల సేకరణ
- కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం ఇంఛార్జ్ వంగా గీత
- సంతకాల వాహనాన్ని ర్యాలీగా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి తరలింపు
పార్వతీపురం మన్యం జిల్లా
- పాలకొండలో కోటి సంతకాల కార్యక్రమం
- సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ పాలవలస శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
- ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అని తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు
కర్నూలు జిల్లా
- పత్తికొండ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ పూర్తయింది.
- సంతకాల పత్రుల వాహనానికి జెండా ఊపిన మాజీ ఎమ్మెల్యే కంగాటి
- పత్రుల వాహనాన్ని ర్యాలీగా తీసుకెళ్లిన కార్యకర్తలు
చిత‍్తూరు జిల్లాలో
పుంగనూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి
సంతకాల ప్రతులను చిత్తూరు,తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డికి అందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుంటూరు జిల్లాలో..
గుంటూరు:
మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటానికి నిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించి గవర్నర్ కు పంపే డాక్యుమెంట్లను భారీ ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలింపు
పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
మాచర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటానికి నిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించి గవర్నర్ కు పంపే డాక్యుమెంట్లను భారీ ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలింపు
భట్టిప్రోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్నినిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించి గవర్నర్ కు పంపే డాక్యుమెంట్లను భారీ ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలింపు
వైఎస్సార్ జిల్లాలో..
- కోటి సంతకాల సేకరణ విజయవంతం సందర్భంగా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మైదుకూరు నియోజకవర్గం లో 70 వేల సంతకాల సేకరణ...
మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి కామెంట్స్
- వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు చివరకు వైద్యానికి వైద్య విద్యకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు...
- వైద్యాన్ని పేదలకు సొంతం చేసిన వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలు నిర్మించారు...
- కూటమి ప్రభుత్వం కేవలం ధనవంతుల పక్షం వహించి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం మరియు వైద్య విద్యను దూరం చేస్తుంది...
- కూటమి ప్రభుత్వం చేసే అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు...
- ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తరలింపు ర్యాలీ
- కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులను కడప జిల్లా కేంద్రానికి జెండా ఊపి తరలించిన పార్టీ ఇంచార్జ్ నరేన్ రామాంజులరెడ్డి.
- స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అప్పాయిపల్లి వరకు ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా:
- మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ,
- పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పరిశీలకులు రమేష్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి, యువనేత వై. ప్రణయ్ రెడ్డి,
- ర్యాలీలో ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ప్రజలు చేసిన కోటి సంతకాల ప్రతులు ప్రదర్శన,
- ర్యాలీ అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి తరలించిన కోటి సంతకాలు.
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల పత్రులను జిల్లా కేంద్రానికి తరలింపు కార్యక్రమాన్ని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య
శ్రీ సత్యసాయి జిల్లాలో
శ్రీ సత్యసాయి జిల్లా:
- పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణపై మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం.
- ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ 66వేల ప్రతులపై సంతకాలు సేకరించామన్న శ్రీధర్ రెడ్డి
- త్వరలోనే ప్రతులను విజయవాడకు పంపడం జరుగుతుందన్న శ్రీధర్ రెడ్డి
- అనంతపురం జిల్లా : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల పత్రులను జిల్లా కేంద్రానికి తరలింపు
- కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి.
అన్నమయ్య జిల్లాలో..
అన్నమయ్య జిల్లా,
- రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రజా ఉద్యమం పత్రాలను జేండా ఉపి జిల్లా కార్యాలయనికి తతరలించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.
- పాల్గొన్న అన్ని మండలాల, పట్టణ ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- మెడికల్ కళాశాల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- ప్రజల ఆరోగ్యం పై వ్యాపారం చేయేద్దు.
- ప్రజనిరసనలు చుసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.
- రాయచోటి నియోజకవర్గంలో 82 గ్రామాల్లో, పట్టణంలోని 14 వార్డుల్లో స్వయంగా పర్యటించి సంతకాలు సేకరించా
- రాష్ట్రవ్యాప్తంగా అనుకోన్న లక్ష్యం కంటే కోటికి పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
- 15న జిల్లా విజయవాడకు తతరలించి 17న గవర్నర్ కు అందిస్తాం.
- జగన్ హయాంలో స్కూల్స్, హాస్పిటల్స్, సచివాలయాల, పోర్టుల ఆబివృద్ది జరిగింది.


