చంద్రబాబు పాలనపై ప్రతిఘటన యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కలం కలం కలిసి కోటి గళాల స్వరంగా మారింది. వైద్యం ప్రైవేటీకరణపై కోటి గళాలు ఏకమై చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఊరూ వాడా ఏకమై కదులుతుంది. ఏపీలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, అది ప్రజల సమిష్టి ప్రతిఘటన. చంద్రబాబు పాలనపై రణభేరీ అంటే సరిగ్గా సరిపోతుందేమో.
కలం కలం కలిసి.. ప్రజా గళంగా మారి..
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయం అనంతరం వైఎస్సార్‌సీపీ కోటి సంకతాల సేకరణకు పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ పిలుపు ఇచ్చింది మొదలుకొని ప్రజా సమర సంతకం ఒక్కొక్కటిగా ఊపిరి పోసుకుంది. అది కోటికి పైగా సంతకాల సేకరణతో నిలువెత్తు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రేవేటుపరం కాకుండా చూడాలని తమ సంతకంతోనే సమాదానం చెప్పారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతారా.. లేదా అని ప్రశ్నించడమే కాదు.. కచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
లక్ష్యం.. కోటి సంతకాలు.. కానీ..
వైఎస్సార్‌సీపీ నిర్దేశించుకున్న లక్ష్యం కోటి సంతకాలు. కానీ ఆ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చింది. కోటి సంతకాలతో లక్ష్యం పూర్తయినా, జనం నుంచి స్పందన వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కోటి సంతకాల సంఖ్య దాటిపోయింది. దీనికి ప్రజలు విస్తృతంగా మద్దతు తెలపడంతో కోటి సంతకాల సేకరణ కాస్తా కోట్లాడి గళాల నిరసనగా రూపాంతరం చెందింది. కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ కార్పొరేట్ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా స్వరం.. సంతకాల రూపంలో ఉద్యమించింది.
ప్రతిఘటనగా మారి..
వైఎస్ జగన్ తన హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి, 5లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.- ఇప్పుడు వాటిని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తుంది. వైద్య విద్యను అత్యంత కాస్ట్‌లీగా మార్చాలనే చంద్రబాబు ప్రయత్నాన్నిప్రజా ఉద్యమంతోనే తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ భావించింది. ఆ క్రమంలోనే కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఇది అత్యంత విజయవంతమై జనసంద్రంగా మారింది. అయితే ఈ అంశంపై 18వ తేదీన గవర్నర్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. ప్రజల స్పందనను గవర్నర్ ముందుకే తీసుకుపోనున్నారు వైఎస్ జగన్.
ర్యాలీలు, సమావేశాలు..
కోటి సంతకాల సేకరణ అనంతరం గ ప్రజా ఉద్యమం పత్రాలను జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. నిన్న(బుధవారం, డిసెంబర్ 10వతేదీన) ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విజయవంతంగా జరిగింది. సుమారు అన్ని జిల్లా పార్టీ కేంద్రాలయాకు ఈ ప్రతులు చేరిపోయాయి. 15వ తేదీన విజయవాడకు వీటిని తరలించనున్నారు. ఆపై 18వ తేదీన గవర్నర్‌ను వైఎస్ జగన్ కలవనున్నారు. మొత్తంగా, "కోటి సంతకాల ఉద్యమం" ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ, బాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటనగా మారింది. బాబు పాలనపై వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ, ఈ ఉద్యమాన్ని ప్రజా శక్తి ప్రదర్శనగా మలచింది. గవర్నర్‌కు సంతకాలు సమర్పించిన తర్వాత, ఈ ఉద్యమం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది.


