వైఎస్సార్‌జిల్లా: జిల్లాలోని ముద్దనూరు ఎంపీపీ పదవిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ముద్దనూరు ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. ముద్దనూరు మండల స్థానానికి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మొత్తం 10 స్థానాలున్నాయి. ఇందులో వైఎస్సార్‌సీపీకి 6గురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉన్నారు. దాంతో వైఎస్సార్‌సీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కూటమి నేతలు ప్రలోభాలకు దిగినప్పటికీ వైఎస్సార్‌సీపీ తమ సభ్యులకు విప్ జారీ చేయడంతో ఊహించినట్లే ఈ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
ఈ ఎన్నికకు సంబంధించి పలువురి సభ్యులపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభావం ఉందని ఆరోపేణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీకి భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ అనుచరులు తమ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు గురి కాకుండా ఓటేయడంతో వైఎస్సార్‌సీపీనే ఈ స్థానాన్ని దక్కించుకుంది.
విస్సన్నపేట ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీదే
ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట ఎంపీపీ పదవిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


