అనకాపల్లి: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని బార్‌గా మార్చారనే ఆరోపణలు ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీకి చెందిన నేత సూర్య చంద్ర బార్‌గా మార్చి అక్కడ దావత్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పార్టీ కార్యాలయాన్ని బార్‌గా మార్చడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి జనసేన శ్రేణులు. రాజకీయ పార్టీ కార్యాలయం ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా ఉండాలి కానీ, దాన్ని ఇలా వినియోగించడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తల నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది పార్టీ సిద్ధాంతాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగిందని, ఇది పార్టీకి అవమానకరమని మండిపడుతున్నారు.


