‘వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను పోలీసులు కిడ్నాప్‌ చేశారు’ | Machavaram MPP Election: Kasu Mahesh Reddy Takes On TDP | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను పోలీసులు కిడ్నాప్‌ చేశారు’

Dec 11 2025 8:45 AM | Updated on Dec 11 2025 9:20 AM

Machavaram MPP Election: Kasu Mahesh Reddy Takes On TDP

మాచవరం: మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి టీడీపీకి బలం లేకపోయినా కుట్రలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రడ్డి ధ్వజమెత్తారు. మాచవరంలో వైఎస్సార్‌సీపీకే బలం ఉందని, అందుకే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేశారన్నారు. ఈ కిడ్నాప్‌ వెనుక పోలీసుల హస్తం ఉందని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. దాచేపల్లి సీఐ భాస్కర్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీలసీలను కిడ్నాప్‌ చేశారన్నారు. కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారకపోతే గంజాయి కేసు బనాయిస్తామని సీఐ బెదిరింపు చర్యలకు దిగారని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. 

కాగా, మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఈరోజు(గురువారం, డిసంబర్‌ 11వ తేదీ జరుగనుంది.  ఇటీవల మండల పరిషత్‌ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.  ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్‌సీపీకే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, పోటికి దిగిన టీడీపీ వివాదాలు స్పష్టిస్తోంది. 

మాచవరం మండలంలె 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా,  ఇందులో 13 స్థానాల్లో 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులుండగా, కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు.  అయితే పోలీసుల సాయంతో ఎంపీపీని గెలుచుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. అందుకే పోటీకి దిగి అనైతిక చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది. కుట్రలు , కుతంత్రాలు చేస్తూ ఎన్నిక జరగ్గకుండా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి విమర్శిస్తున్నారు.  ఆ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement