వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకాభిప్రాయం సాధించిన వైఎస్సార్‌సీపీ
కార్పొరేటర్ల మధ్య చీలికల కోసం టీడీపీ సన్నాహాలు
టీడీపీ నేతల ఎత్తులను చిత్తు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
నేడు మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్‌ను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం ఆపార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది.
కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పారీ్టలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది.
వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయతి్నంచి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బి అంజాద్‌బాషా, మాజీ మేయర్ కె సురేష్‌బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్‌ను మేయర్ అభ్యరి్థగా ప్రకటించారు.
టీడీపీకి శృంగ భంగం...
కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబి్ధపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చీలికలు ఆశించారు. వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ఆ పార్టీ నేతలు కసరత్తు చేసి సఫలీకృతులు కావడంతో మేయర్ ఎన్నిక గురువారం నాడు లాంఛనంగా పూర్తి కానుంది. బలం లేని కారణంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదివరకే ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థగా పాకా సురేష్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
పాకా సురేను గొప్ప ఆధిక్యతతో గెలిపించాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి పాకా సురేష్ కుమార్‌ను కార్పొరేటర్లు అందరూ గొప్ప అధిక్యతతో గెలిపించాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కడపలోని తన నివా సంలో మేయర్ ఎంపికపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరిని మేయర్‌గా నిలబెట్టాలన్న అంశంపై అందరితో సమాలోచనలు చేసి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం పాకా సురేష్‌ను వైఎస్సార్‌సీపీ తరుపున మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు.
కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతకు ఎంపీపీగా అవకాశం ..
ముద్దనూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డా. సు«దీర్‌రెడ్డిలతో సమాలోచనలు చేశామని ఎంపీ తెలిపారు. ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఏకాభిప్రాయంతో మేయర్ అభ్యర్థి ఎంపిక: రవీంద్రనాథ్‌రెడ్డి
ఏకాభిప్రాయంతో కడప మేయర్ అభ్యర్థి ఎంపిక చేశామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లలో ముగ్గు్గరు మేయర్ పదవి ఆశించారని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పాకా సురేష్‌ను ఏక గ్రీవంగా ఎంపిక చేశామన్నారు. వైఎస్సార్‌సీపీలో చీలిక తేవాలని టీడీపీ పాచిక వేసిందని, కార్పొరేటర్ల ఐక్యత ముందు అది పారలేదని తెలిపారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు: పాకా సురేష్
తనను మేయర్ అభ్యరి్థగా ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పాకా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ ఎన్నిక అనివార్యంగా మారిందని, ఈ నేపథ్యంలో నా అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను మేయర్‌గా గెలిపించాలని కార్పొ రేటర్లను కోరుతున్నానని తెలిపారు.


