టెట్ పరీక్ష ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా తొలి రోజు బుధవారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం సెషన్లో కడప నగరంలోని ఐదు పరీక్ష కేంద్రాలతోపాటు ప్రొద్దుటూరులో ఒక్క పరీక్ష కేంద్రంలో నిర్వహించిన టెట్ పరీక్ష కు సంబంధించి 709 మంది విద్యార్థులకు గాను 673 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్ లో కడపలో మూడు పరీక్ష కేంద్రాలలో 440 మంది అభ్యర్థులకుగానూ 411 మంది హాజరయ్యారు. కడపలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ షేక్ శంషుద్దీన్ పరిశీలించారు.
సబ్ జైలు తనిఖీ
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని సబ్ జైలును రెండవ అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం మానవ హక్కుల దినోత్సవంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల గురించి రిమాండ్ ఖైదీలకు న్యాయమూర్తి వివరించారు.
పులివెందుల రూరల్: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. పట్టణంలోని స్థానిక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడులు హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ప్రతిభ గల క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి ఏపీకి మంచి పేరు తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి, అబ్జర్వర్ రాఖీ రాజేష్ బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ప్రవీణ్, కిరణ్, సీనియర్ రిటైర్డ్ పీఈటీ కొండారెడ్డి, రిటైర్డ్ పీడీ విజయప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టెట్ పరీక్ష ప్రశాంతం


