వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడికి విప్ జారీ చేసే అధిక
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున విప్ జారీ చేసే అఽధికారం ఆ పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డికి లభించింది. బుధవారం కేంద్ర కార్యాల యం నుంచి వచ్చిన ఉత్తర్వులను రవీంద్రనాథ్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అఽధికారి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌కు అందజేశారు. ఈ నెల 11వ తేదీ గురువారం వైఎస్సార్‌సీపీ తరుపున మేయర్‌గా పోటీ చేయబోయే అభ్యర్థికి ఆయన బి. ఫారం ఇవ్వనున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేయనున్నారు.


