ఎంపీపీ ఎన్నికకు పటిష్ట చర్యలు
ముద్దనూరు : మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సాయిశ్రీ, జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబుళమ్మ, డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వారు ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ సభ్యులు 9మంది, ఒక కో–ఆప్షన్ సభ్యుడికి మాత్రమే సభాభవనంలోకి అనుమతి ఉంటుందన్నారు. వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలను తప్ప ఇతరులు ఎవరినీ లోపలికి అనుమతించమని తెలిపారు. ఇప్పటికే అందరికీ ఎంట్రీ పాసులు అందజేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో ఎన్నికను చిత్రీకరించనున్నట్లు, ఎంపీడీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అలీఖాన్, ఎంపీడీఓ రాధాకృష్ణాదేవి, సీఐ దస్తగిరి, ఎస్‌ఐ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా
జిల్లా బాక్సింగ్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి విజయ్ భాస్కర్ తెలిపారు. బుధవారం నగరంలోని మున్సిపల్ మైదానంలో జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను నిర్వహించారు. 50–55 కేజీల విభాగంలో ఆంజనేయులు, 55–60 కేజీల విభాగంలో మహ్మద్ ఆలీ, 60–65 కేజీల విభాగంలో తలారి శ్రీనివాసులు, 70–75 కేజీల విభాగంలో చిత్తా రవికాంత్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ లయోలా కళాశాలలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.
పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు
కడప అర్బన్ : ఇటీవల ఎంపికై న స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(ఎస్.సి.టి.పి.సి)కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) బుధవారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలోని వసతి ఏర్పాట్లను, కిచెన్ రూమ్, తరగతి గదులను, కార్యాలయ గదులను, మైదానం, అంతర్గత రహదారులను, బాటిల్ అబ్స్టాకల్స్‌ను పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ వెంట డి.టి.సి. డీఎస్పీ అబ్దుల్ కరీం, డి.టి.సి. ఇన్‌స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు.
ఎంపీపీ ఎన్నికకు పటిష్ట చర్యలు
ఎంపీపీ ఎన్నికకు పటిష్ట చర్యలు


