కోటి సంతకాలకు జన నీరాజనం | - | Sakshi
Sakshi News home page

కోటి సంతకాలకు జన నీరాజనం

Dec 11 2025 8:18 AM | Updated on Dec 11 2025 8:18 AM

కోటి

కోటి సంతకాలకు జన నీరాజనం

కోటి సంతకాలకు జన నీరాజనం

జమ్మలమడుగులో కోటి సంతకాల ప్రతులను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అందజేస్తున్న నాయకులు

కోటి సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కమలాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న నరేన్‌ రామాంజుల రెడ్డి, పార్టీ నేతలు

మైదుకూరులో ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నాయకులు

బద్వేలులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ

పులివెందులలో కోటి సంతకాల ప్రతుల వాహనాన్ని ప్రారంభిస్తున్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి ప్రొద్దుటూరులో వైఎస్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు , పార్టీ శ్రేణులు

కడప కార్పొరేషన్‌: ెుడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జన ం నీరాజనం పలికారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రాలను పండుగ వాతావరణంలో వాహనాలలో ఎక్కించి జిల్లా కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ర్యాలీలు నిర్వహించి సంఘీభావం ప్రకటించారు.

జిల్లా కేంద్రమైన కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో సుమారు 70 వేల సంతకాలతో కూడిన పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ వాహనానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్‌ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి తరలించారు. తొలుత ఈ పత్రాల బండిళ్లను వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఉంచి, దివంగత వైఎస్సార్‌కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షా 200 సంతకాలు సేకరించారు. వాటిని ప్రత్యేక వాహనంలో కడపకు తరలించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 90,200 సంతకాలు సేకరించారు. సంతకాలు చేసిన పత్రాలను తరలించే వాహనాన్ని మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతారణంలో కొనసాగింది.

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 50 వేల సంతకాలు సేకరించారు. బుధవారం ఈ సంతకాలు చేసిన పత్రాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ వాహనాలను రామసుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కమలాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో 60,240 సంతకాలు సేకరించారు. ఈ సంతకాలతో కూడిన బండిళ్లను బుధవారం జిల్లా కార్యాలయానికి తరలించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్దగల వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. సుమారు 30 బాక్సుల్లో వీటిని వాహనంలో ఎక్కించి పంపారు. అంతకుముందు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరేన్‌ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి అప్పాయపల్లె వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 70 వేల సంతకాలను సేకరించారు. తొలుత పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఖాజీపేట వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంతకాలు చేసిన పత్రాలను బాక్సు ల్లో భద్రపరిచి కడపలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డా. దాసరి సుధ ఆధ్వర్యంలో 60 వేల సంతకాలు సేకరించారు. తొలుత ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీనేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సిద్దవటం రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం సంతకాల పత్రాలు తరలించే వాహనానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జెండా ఊపి జిల్లా కార్యాలయానికి సాగనంపారు.

పండుగ వాతావరణంలో జిల్లా కార్యాలయానికి తరలింపు

పలుచోట్ల ర్యాలీలు

కోటి సంతకాలకు జన నీరాజనం 1
1/6

కోటి సంతకాలకు జన నీరాజనం

కోటి సంతకాలకు జన నీరాజనం 2
2/6

కోటి సంతకాలకు జన నీరాజనం

కోటి సంతకాలకు జన నీరాజనం 3
3/6

కోటి సంతకాలకు జన నీరాజనం

కోటి సంతకాలకు జన నీరాజనం 4
4/6

కోటి సంతకాలకు జన నీరాజనం

కోటి సంతకాలకు జన నీరాజనం 5
5/6

కోటి సంతకాలకు జన నీరాజనం

కోటి సంతకాలకు జన నీరాజనం 6
6/6

కోటి సంతకాలకు జన నీరాజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement