పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు | volvo bus in paddy field | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు

Mar 15 2015 11:31 AM | Updated on Sep 2 2017 10:54 PM

పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు

పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు

ట్రాక్టర్ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది.

విశాఖపట్నం:  ట్రాక్టర్ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటన విశాఖ జిల్లా కాశీంకోట సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.

బస్సులోని దాదాపు 33 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో స్వస్థలాలకు పంపారు. గాయపడిన డ్రైవర్ను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement