విజయనగరంలో బస్సు బోల్తా

Bus with 25 passengers Over turned in Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందినవారు కాశీయాత్ర ముంగించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. తోటపల్లి ఎడవకాలువ వద్దకు రాగానే వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి 20 మంది యాత్రికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాజువాకకు చెందిన గౌరీశంకర్ ట్రావెల్స్ బస్సుకు ఈ ప్రమాదానికి గురైంది. 

ఆళ్ళగడ్డలో ఘోర రోడ్డుప్రమాదం
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు విహారయాత్ర చేపడుతుండగా తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top