టీడీపీ గూండాల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కిడ్నాప్‌ | Ysrcp Mptc Kidnapped In Satyavedu Constituency | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కిడ్నాప్‌

Nov 10 2026 8:58 AM | Updated on Nov 10 2026 9:04 AM

Ysrcp Mptc Kidnapped In Satyavedu Constituency

సాక్షి, తిరుపతి జిల్లా: సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ కలత్తూరు ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డిని టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం మండలం ఎంపీపీ పదవి కోసం టీడీపీ కుట్రలకు తెరలేపింది.

రేపు ఎంపీపీ పదవికు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. కేవీబీ పురం మండలంలో వైఎస్సార్‌సీపీఇకి 6 ఎంపీటీసీలు, టీడీపీ 6 ఎంపీటీసీల స్థానాలు రాగా, మెజారిటీ కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేత కిడ్నాప్  చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ కుట్ర రాజకీయాలు చేసింది.

కాళంగి అదరం ఎంపీటీసీ స్థానం లక్ష్మీ శోభన వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందగా.. ఎన్నికల కౌంటింగ్ రోజు కుట్ర చేసి.. టీడీపీ అభ్యర్దిని మీనాక్షి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తాజాగా ఎంపీటీసీని కిడ్నాప్ చేసి.. ఎంపీపీ కోసం టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది.

కూటమి అరాచకాలపై న్యాయ పోరాటం: ఎంపీ గురుమూర్తి
వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సందర్భంగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. కేవీబీ పురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ గెలిస్తే.. టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు.. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని గురుమూర్తి అన్నారు.

ఇదీ చదవండి: గెలుపు కాదు అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement