‘అంతా మీరే చేశారు’.. విమానాల అంతరాయంపై ట్రంప్‌ సర్కార్‌ వాదన | US flight chaos Sean Duffy blames previous administrations | Sakshi
Sakshi News home page

‘అంతా మీరే చేశారు’.. విమానాల అంతరాయంపై ట్రంప్‌ సర్కార్‌ వాదన

Nov 16 2026 7:59 AM | Updated on Nov 16 2026 7:59 AM

US flight chaos Sean Duffy blames previous administrations

వాషింగ్టన్‌: అమెరికాలో విమానయాన వ్యవస్థ తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణమని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ఆరోపించారు. విమాన నియంత్రణ వ్యవస్థను ఆధునీకరించేందుకు కాంగ్రెస్ మరో 50 బిలియన్ డాలర్లు కేటాయించాలని కోరారు.

ఆదివారం సీఎన్ఎన్‌ కార్యక్రమంలో మాట్లాడిన డఫీ.. అమెరికా విమానయాన వ్యవస్థలో కీలక పరికరాలు కాలం చెల్లినవిగా మారాయని చెప్పారు. ప్రస్తుతం 1990ల నాటి వ్యవస్థలు, 1960-70ల కాలం నాటి రాడార్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జరిగిన అంతరాయానికి సమాధానమిస్తూ గత ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ, ‘అంతా వాళ్లే చేశారు’ అ‍న్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆమోదించిన 12.5 బిలియన్ డాలర్లు సమస్యల పరిష్కారానికి సరిపోవని డఫీ పేర్కొన్నారు. ఆ నిధులను రేడియోలు, రాడార్లు, టెలికమ్యూనికేషన్ పరికరాల ఆధునీకరణకు మాత్రమే కేటాయించారని తెలిపారు. కొత్త నెట్‌వర్క్‌లు, విమానాల మధ్య దూరాన్ని పర్యవేక్షించే సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి అదనపు నిధులు లేవన్నారు.

మరోవైపు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని చెప్పారు. కొన్ని భవనాల్లో లిఫ్టులు, ఎయిర్ కండిషనింగ్ పనిచేయడం లేదని, మరికొన్ని చోట్ల పైకప్పుల నుంచి నీరు కారుతోందని వివరించారు. అయితే, ఇప్పటికే కేటాయించిన నిధుల్లో కొద్ది మొత్తమే వినియోగించినప్పటికీ మరో 50 బిలియన్ డాలర్లు ఎందుకు కోరుతున్నారని డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు. సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ మాట్లాడుతూ ప్రభుత్వం కోరిన నిధులను కాంగ్రెస్ ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. అదనపు నిధులు అవసరమైతే వాటికి సంబంధించిన కారణాలను వివరించాలని, విమానయాన భద్రతకు అవసరమైన నిధులను అందిస్తామని తెలిపారు. 

ఇదీ చదవండి: పాక్‌ను వణికిస్తున్న బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కొత్త చీఫ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement