మీడియా ప్రక్షాళనపై చెక్‌ వాసుల కన్నెర్ర  | Public media freedom has been eroded across central Europe | Sakshi
Sakshi News home page

మీడియా ప్రక్షాళనపై చెక్‌ వాసుల కన్నెర్ర 

Nov 16 2026 6:17 AM | Updated on Nov 16 2026 6:17 AM

Public media freedom has been eroded across central Europe

ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ

ప్రేగ్‌: ప్రభుత్వ మీడియా విధానంలో సమూ ల మార్పులు చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన ప్రయత్నాలను నిరసిస్తూ చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. మీడియా సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులపై నియంత్రణల ఫలితంగా మీడియా సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన కారులు నినదించారు. రాజధానిలోని చారిత్రక లెట్నా పార్కు లో జరిగిన ర్యాలీలో కనీసం 3.50 లక్షల మంది పాల్గొన్నట్లు దీనికి సారథ్యం వహించిన మిలియన్‌ మూవ్‌మెంట్స్‌ ఫర్‌ డెమోక్రసీ గ్రూపునకు చెందిన మికులస్‌ మినార్‌ తెలిపారు. 

ఇది గుర్తించుకోదగ్గ రోజని చెప్పారు. దేశంలో 40 ఏళ్ల కమ్యూనిస్ట్‌ పాలనకు అంతం పలికిన 1989నాటి వెల్వెట్‌ విప్లవానికి కూడా ఈ పార్కులోనే బీజం పడిందన్నారు. ఆ విప్లవం వార్షికోత్సవం మరో రెండు రోజుల్లో ఉందనగా ఈ ప్రదర్శన జరగడం విశేషం. ప్రధానమంత్రి ఆండ్రెజ్‌ బబిస్‌ ఆధ్వర్యంలోని మూడు పారీ్టల కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని మినార్‌ ఆరోపించారు. 

చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రభుత్వ రేడియో, టీవీ సంస్థలు ప్రైవేట్‌ వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు ఇచ్చే విరాళాలతోనే నడుస్తున్నాయి. ప్రధాని ప్రతిపాదన ప్రకారం..ఈ సంస్థలకు ఇకపై ప్రభు త్వమే నిధులు మంజూరు చేస్తుంది. దీంతో, మీడియా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు, తమ వేతనాలు సైతం కనీ సం 15 శాతం కోతపడతాయని మీడియా సంస్థల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఫలిత ంగా, ఉద్యోగుల తొలగింపు, కార్యక్రమాల్లో కోత, రద్దు వంటివి సైతం తప్పవని ఆందోళ న చెందుతున్నారు. కాగా, బబిస్‌ ప్రభుత్వం రష్యా అనుకూల, నాటో, ఈయూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement