ఎన్విడియా (Nvidia) వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంబంధాలపై వివాదం కొనసాగుతున్న వేళ.. ఆలిస్ హువాంగ్‌కు సంబంధించి సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థ తొలిసారి స్పందించింది. ఆలిస్ హువాంగ్ 2025 ఆగస్టు 30నే సంస్థ నుంచి వైదొలిగారని, ప్రస్తుతం ఆమెకు కంపెనీలో ఎలాంటి బాధ్యతలు లేవని మెగాస్పీడ్ సంస్థ స్పష్టం చేసింది.
అంతేకాదు ఆమె వ్యక్తిగత, ప్రైవేట్ విషయాలపై తాము వ్యాఖ్యానించబోమని మెగాస్పీడ్ తెలిపింది. ఇక తమ వ్యాపార కార్యకలాపాలన్నీ చట్టబద్ధంగానే కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్ర అంతర్గత విచారణ కోసం బయటి న్యాయ నిపుణులను కూడా నియమించినట్లు వెల్లడించింది.
ఇటీవల జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలిస్ చైనా నిఘా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా వర్గాలకు ఉన్నట్లు పలు కథనాలు వెల్లడించాయి.
మరోవైపు నిషేధిత ఎన్విడియా ఏఐ చిప్‌లను చైనాకు అక్రమంగా తరలించేందుకు మెగాస్పీడ్‌ను అడ్డాగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై అమెరికా అధికారులు 2024 నుంచి దర్యాప్తు చేస్తున్నారు. సింగపూర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమపై వస్తోన్న ఆరోపణలను మెగాస్పీడ్ ఖండించింది.
ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్


