హసీనా రీఎంట్రీపై బంగ్లాదేశ్‌ కీలక ప్రకటన | Hasina Return to Bangladesh Law Minister Says Ball Is in India Court | Sakshi
Sakshi News home page

హసీనా రీఎంట్రీపై బంగ్లాదేశ్‌ కీలక ప్రకటన

Nov 15 2026 10:40 AM | Updated on Nov 15 2026 10:40 AM

Hasina Return to Bangladesh Law Minister Says Ball Is in India Court

ఢాకా: అధికారం కోల్పోయి.. దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారా? వస్తే ఆమెకు ఎదురయ్యేది స్వాగతమా.. మరణశిక్షా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. హసీనా తిరిగి రావడంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక సంకేతాలు ఇచ్చింది. ఈ విషయంలో తమ వైపు నుంచి చేయాల్సిన న్యాయ ప్రక్రియను పూర్తి చేశామని ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్‌ ప్రకటించారు. ఇక ఏం చేయాలన్నది భారత్‌ చేతుల్లోనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌ మీడియా కథనం ప్రకారం.. హసీనాకు చట్టపరమైన మార్గాల్లో స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కల్పిస్తారా అని మంత్రిని ప్రశ్నించగా.. ఆమె తప్పకుండా తిరిగి వస్తారని సమాధానమిచ్చారు. మరోవైపు, న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ను సంప్రదించిన హసీనా.. కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరినట్లు సమాచారం. 2024లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన ఆమె భారత్‌కు వచ్చారు.

జీవిత ఖైదు.. ఉరిశిక్ష?
అయితే హసీనా స్వదేశానికి వస్తే మరణశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2024లో నిరసనకారుల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ ఆమెకు ఒక కేసులో మరణశిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలను హసీనా ఖండించారు. అప్పీల్‌ చేసుకునే గడువు ముగిసినందున తిరిగి వస్తే మరణశిక్ష అమలే మార్గమని ట్రిబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ గతంలో వ్యాఖ్యానించారు.

హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌ పలుమార్లు భారత్‌ను కోరింది. ఈ అభ్యర్థనలను పరిశీలిస్తున్నామని భారత్‌ గతంలో తెలిపింది. ఆమె తిరిగి వెళ్లే విషయంలో బంగ్లాదేశ్‌ సైన్యం సహకరించడంతో పాటు, మరణశిక్షపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాలన్న హామీని భారత్‌ కోరినట్లు సమాచారం. అయితే ఈ నివేదికపై భారత విదేశాంగ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో హసీనా తిరుగు ప్రయాణంపై భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: జేబులో చిల్లిగవ్వ లేదు.. టాప్‌-6లో ఉంటామంటూ పాక్‌ ప్రకటన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement