పాలస్తీనాకు మద్దతుగా భారత్‌ ఓటు! | India supports UNGA resolution on permanent sovereignty of Palestinian people | Sakshi
Sakshi News home page

పాలస్తీనాకు మద్దతుగా భారత్‌ ఓటు!

Nov 15 2026 4:56 AM | Updated on Nov 15 2026 4:56 AM

India supports UNGA resolution on permanent sovereignty of Palestinian people

ఆక్రమిత ప్రాంతంపై హక్కులు పాలస్తీనావే 

సెటిల్మెంట్లు, దాడుల నిలిపివేతకు డిమాండ్‌ 

అనుకూలంగా 151 దేశాలు.. వ్యతిరేకంగా ఏడుగురు

యునైటెడ్‌ నేషన్స్‌: ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరుసలేం, ఆక్రమిత సిరియా గోలాన్‌ ప్రాంతాల్లోని సహజ వనరులపై పాలస్తీనా ప్రజలు, అరబ్‌ జనాభాకు శాశ్వత సార్వ¿ౌమ హక్కులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి పునరుద్ఘాటించింది. ఇదే అంశంపై ఉరుగ్వే ఒక తీర్మానం ప్రవేశపెట్టగా భారత్‌ సహా 151 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇజ్రాయెల్, అమెరికా సహా ఏడు దేశాలు వ్యతిరేకించగా, 11 దేశాలు తటస్థంగా నిలిచాయి. 

ఈ తీర్మానంలో పాలస్తీనా ప్రజలు, ఆక్రమిత సిరియా గోలాన్‌ ప్రాంతంలోని అరబ్‌ జనాభాకు భూమి, నీరు, ఇంధన వనరులు సహా సహజ సంపదలపై ఉన్న అవిభాజ్య హక్కులను ధృవీకరించారు. అలాగే, ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరుసలేం, సిరియా గోలాన్‌ ప్రాంతాల్లో సహజ వనరులను ఇజ్రాయెల్‌ దోచుకోవడం నష్టం కలిగించడం, నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ నిర్మిస్తున్న సెటిల్మెంట్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 

2004 జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం సూచనలు, ఐరాస తీర్మానాల్లో పేర్కొన్న బాధ్యతలను అమలు చేయాలని తీర్మానం పిలుపునిచ్చింది. తూర్పు జెరుసలేం సహా ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల స్వరూపం, హోదాను మార్చేలా చేపడుతున్న అన్ని విధానాలు, చర్యలను ఇజ్రాయెల్‌ పూర్తిగా నిలిపివేయాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. తూర్పు జెరుసలేం, ఆక్రమిత సిరియా గోలాన్‌ ప్రాంతాల్లో చెత్త వ్యర్థాల పారవేత వంటి పర్యావరణ హానికర చర్యలను, ఇజ్రాయెలీ సెటిలర్ల ద్వారా జరుగుతున్న విధ్వంసక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement