breaking news
Syrian border
-
పాలస్తీనాకు మద్దతుగా భారత్ ఓటు!
యునైటెడ్ నేషన్స్: ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరుసలేం, ఆక్రమిత సిరియా గోలాన్ ప్రాంతాల్లోని సహజ వనరులపై పాలస్తీనా ప్రజలు, అరబ్ జనాభాకు శాశ్వత సార్వ¿ౌమ హక్కులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి పునరుద్ఘాటించింది. ఇదే అంశంపై ఉరుగ్వే ఒక తీర్మానం ప్రవేశపెట్టగా భారత్ సహా 151 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇజ్రాయెల్, అమెరికా సహా ఏడు దేశాలు వ్యతిరేకించగా, 11 దేశాలు తటస్థంగా నిలిచాయి. ఈ తీర్మానంలో పాలస్తీనా ప్రజలు, ఆక్రమిత సిరియా గోలాన్ ప్రాంతంలోని అరబ్ జనాభాకు భూమి, నీరు, ఇంధన వనరులు సహా సహజ సంపదలపై ఉన్న అవిభాజ్య హక్కులను ధృవీకరించారు. అలాగే, ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, తూర్పు జెరుసలేం, సిరియా గోలాన్ ప్రాంతాల్లో సహజ వనరులను ఇజ్రాయెల్ దోచుకోవడం నష్టం కలిగించడం, నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్మిస్తున్న సెటిల్మెంట్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2004 జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం సూచనలు, ఐరాస తీర్మానాల్లో పేర్కొన్న బాధ్యతలను అమలు చేయాలని తీర్మానం పిలుపునిచ్చింది. తూర్పు జెరుసలేం సహా ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల స్వరూపం, హోదాను మార్చేలా చేపడుతున్న అన్ని విధానాలు, చర్యలను ఇజ్రాయెల్ పూర్తిగా నిలిపివేయాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. తూర్పు జెరుసలేం, ఆక్రమిత సిరియా గోలాన్ ప్రాంతాల్లో చెత్త వ్యర్థాల పారవేత వంటి పర్యావరణ హానికర చర్యలను, ఇజ్రాయెలీ సెటిలర్ల ద్వారా జరుగుతున్న విధ్వంసక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. -
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ
♦ టర్కీపై మండిపడ్డ పుతిన్ ♦ త్వరలో నాటో ప్రత్యేక సమావేశం అంకారా: తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో రష్యా సుఖోయ్ యుద్ధ విమానం ఎస్యూ 24ను టర్కీ సైన్యం ఎఫ్ 16 యుద్ధ విమానంతో కూల్చివేసింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనను టర్కీ సైన్యంతోపాటు, రష్యా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. తమ గగనతలంలోకి ప్రవేశించడంతోపాటు పలుమార్లు చేసిన హెచ్చరికలను లెక్కచేయనందునే రష్యా విమానాన్ని కూల్చేసినట్లు టర్కీ పేర్కొంది. రష్యా విమానం టర్కీ సరిహద్దు కొండల్లో పేలిపోగా.. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటపడ్డారని. వీరిలో ఒకరు సిరియా ఉగ్రవాదులకు చిక్కారని టర్కీ మీడియా చెప్తుండగా, అయితే ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారని, మరొకరు గల్లంతయ్యారని సిరియా వర్గాలు చెబుతున్నాయి. టర్కీ గగనతలంలోకి తమ విమానం ప్రవేశించిందనడాన్ని రష్యా ఖండించింది. తమ విమానం సిరియా గగనతలంలోనే ఉన్నట్లు నిరూపిస్తామని సవాల్ విసురుతోంది. కానీ, సిరియాలోని ఉగ్రవాదులపై దాడుల పేరుతో తమ సరి హద్దు గ్రామాలపై ర ష్యా దాడులు చేస్తోం దని టర్కీ పేర్కొం ది. టర్కీకి రక్షణగా యూఎస్ యూరోపియన్ కమాండ్ ఆరు యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. టర్కీ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించడాన్ని నాటో తప్పుబట్టింది. టర్కీ అభ్యర్థనమేరకు ఈ ఘటనపై చర్చించేందుకు నాటో వర్గాలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాయి. విమానాన్ని కూల్చడం వెన్నుపోటే: పుతిన్ సిరియా టర్కీ సరిహద్దులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేయడాన్ని రష్యా జీర్ణించుకోలేక పోతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. తమ యుద్ధ విమానాన్ని కూల్చడం వెన్నుపోటని వ్యాఖ్యానించారు. తమ విమానం సిరియా సరిహద్దులో పడిపోయిందని.. అది టర్కీ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. తాజా ఘటన రష్యా, టర్కీ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కాగా తమ గగనతల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకునే హక్కు తమకుందని అందరికీ తెలుసని టర్కిష్ ప్రధాని అహ్మెత్ డవుటోగ్లు వ్యాఖ్యానించారు.


