ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌ల మీటింగ్‌ | Donald Trump, Xi Jinping and Vladimir Putin historic joint meeting in China | Sakshi
Sakshi News home page

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌ల మీటింగ్‌

Nov 15 2026 4:51 AM | Updated on Nov 15 2026 4:51 AM

Donald Trump, Xi Jinping and Vladimir Putin historic joint meeting in China

అపెక్‌ సమావేశాలు వేదిక 

ఇరాన్‌ యుద్ధం చర్చకు రావచ్చునన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన మూడు దేశాల అధ్యక్షులు ఒక్కచోట కలిసే అరుదైన ఘటన వచ్చే వారం చోటు చేసుకోనుంది. ఆసియా పసఫిక్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ (అపెక్‌) సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు సమావేశం కానున్నట్లు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. 

ఈ సమావేశ ప్రణాళికను వైట్‌ హౌస్‌ శుక్రవారం ధ్రువీకరించింది. అయితే ఇందులో భారీ ఒప్పందాలేవీ కుదిరే అవకాశాలు లేవని అంచనా. కాకపోతే ఈ సమావేశం రాజకీయంగా వచ్చే సందేశం ముఖ్యమైంది అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య సంబంధాలు ప్రస్తుతం సంక్లిష్టంగానే ఉన్నాయి. టారిఫ్‌ల యుద్ధం కాస్తా ఆగిపోవడంతో ట్రంప్, షీ కొంత సామరస్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.

 కానీ ఇరాన్‌పై అమెరియా యుద్ధం, ఇతర వివాదాల విషయంలో ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరోవైపు ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు ట్రంప్‌తో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై ఐదేళ్లుగా సాగుతున్న యుద్ధం నిలిపివేతకు దౌత్యమార్గాలను అన్వేíÙస్తున్న విషయం తెలిసిందే.  

అపెక్‌ శిఖరాగ్ర సమావేశాలు ఇరాన్‌ యుద్ధం గురించి చర్చించే అవకాశం కల్పిస్తుందని ట్రంప్‌ ప్రకటించారు. అలాగే అణ్వాయుధాల నిల్వలపై మూడు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం తన లక్ష్యమని కూడా చెప్పుకున్నారు. అమెరికా, రష్యాల మధ్య నిరాయు«దీకరణ ఒప్పందం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. ఫలితంగా యాభై ఏళ్లుగా ఉన్న పరిమితులు రద్దయి.. అణ్వాయుధాల తయారీకి అవకాశాలు పెరిగాయి. ‘న్యూ స్టార్ట్‌’ అని పిలిచే ఈ ఒప్పందాన్ని ఏడాది పొడిగించాలని రష్యా చేసిన విజ్ఞప్తిని ట్రంప్‌ తిరస్కరించారు. చైనానూ చేర్చుకుని సరికొత్త ఒప్పందాన్ని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement