ఇజ్రాయెల్ దాడులు.. హమాస్ సీనియర్ కమాండర్ హతం | Hamas Confirms Death Of Senior Commander Younis In Israeli Airstrike | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్ సీనియర్ కమాండర్ హతం

Nov 15 2026 9:10 AM | Updated on Nov 15 2026 9:13 AM

Hamas Confirms Death Of Senior Commander Younis In Israeli Airstrike

హమాస్‌ కీలక కమాండర్‌ను తమ సైన్యం హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన సమీర్‌ అబూ యూనిస్‌ శనివారం జరిగిన దాడిలో మరణించినట్లు హమాస్‌ కూడా ధ్రువీకరించింది. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ సైన్యం, అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

మరో వైపు హమాస్‌ సాయుధ విభాగం అల్‌-ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌ టెలిగ్రామ్‌లో యూనిస్‌ మరణాన్ని ప్రకటించింది. శనివారం సాయంత్రం జరిగిన పిరికిపంద చర్యతో కూడిన దాడిలో అతడు మరణించాడని పేర్కొంది. అక్టోబర్‌ 7 దాడికి ప్రణాళిక రచించడం, దాన్ని పర్యవేక్షించడంలో అత్యంత కీలకమైన కమాండర్లలో యూనిస్‌ ఒకరని తెలిపింది.

ఖాన్‌ యూనిస్‌కు పశ్చిమాన ఉన్న అల్‌-మవాసీ ప్రాంతంలో యూనిస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ భద్రతా అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. హమాస్‌ అల్‌-ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌లోని రఫా బ్రిగేడ్‌ కమాండర్‌గా యూనిస్‌ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. గాజా పౌర రక్షణ విభాగం అధికార ప్రతినిధి మహమూద్‌ బస్సల్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

53 ఏళ్ల యూనిస్‌ మృతదేహాన్ని తమ సంస్థ స్వీకరించిందని తెలిపారు. దక్షిణ గాజాలో జరిగిన ఈ దాడిలో మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడితో రెండేళ్లపాటు యుద్ధం కొనసాగింది. 2025 అక్టోబర్‌లో యుద్ధానికి తెరదించుతూ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.

ఇదీ చదవండి: జేబులో చిల్లిగవ్వ లేదు.. టాప్‌-6లో ఉంటామంటూ పాక్‌ ప్రకటన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement