breaking news
Israeli airstrike
-
అంతరిక్షపుటంచు నుంచి...
నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం అత్యంత కచి్చతత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్లపాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్‌లో నడి»ొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు. అసలీ దాడి ఎలా జరిగింది, ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధం ఏమిటనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్‌ను ‘రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకెళ్లిందంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే! అసలేమిటి నీలి పిచ్చుక? మూడు బాలిస్టిక్ టార్గెట్ క్షిపుణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలో సుదూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణులను ఫైటర్ జెట్ లేదా రాకెట్‌కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని ‘అంతరిక్ష క్షిపణి’గా కూడా పిలుస్తుంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి, నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రుదేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైళ్లను డమ్మీగా ఉపయోగించి, ప్రాక్టీస్ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు. బరువు 1,900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్‌తోపాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టమ్‌తో ముందుకెళ్తుంది. బయటి నుంచి అందే సిగ్నల్‌తో పనిలేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. బ్లూ స్పారో స్ఫూర్తితో ‘రాక్స్’ ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు దీటుగా బ్లూ స్పారోను డిజైన్ చేశారు. భూవాతావరణాన్ని దాటి ముందుకెళ్లి, మళ్లీ భూవాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్ జెట్‌కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూవాతావరణం పరిధి వరకూ వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్లి భూవాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందుభాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందికి వచ్చే భాగాన్ని రీ–ఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్హెడ్తోపాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్టనిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్‌లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిస్సైల్ ఇరాన్ సుప్రీంలీడర్‌ను బలి తీసుకుంది. రఫేల్ సంస్థ బ్లూ స్పారో డెవలప్మెంట్తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో ‘రాక్స్’ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన కచి్చతత్వంతో లక్ష్యాలను ఛేదించడం రాక్స్ క్షిపణుల ప్రత్యేకత. శత్రుదేశాలు జీపీఎస్ సిగ్నల్స్‌ను జామ్ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూఉపరితలంతోపాటు అంతర్భాగంలోని లక్ష్యాన్ని తాకుతాయి. 500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్(చిత్తుప్రతి) అనుకుంటే రాక్స్ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రభుత్వ వార్తా చానల్ ‘ఇరిన్’ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ సోమవారం క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంతభాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ సహర్ ఎమామి చదువుతున్న వార్తలతోపాటు దాడితో సంభవించిన పేలుడు శబ్ధం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయింది. భయపడిన సహర్ ఎమామి వెంటనే కెమెరాను ఆపేసి, బయటకు పరుగుతీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. అనంతరం సహర్ ఎమామి, మరో యాంకర్‌తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన, ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు తర్వాత ఇరిన్లో టెలికాస్ట్ అయ్యాయి. కాగా, ఇరిన్ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. ఇరిన్పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నియంతృత్వం ఏరూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్ మూడో నంబర్ జిల్లాలో పలు టీవీ, రేడియో చానెళ్లతోపాటు ఇరిన్ కార్యాలయముంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు. టెహ్రాన్‌ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది. గతంలో గాజా, లెబనాన్‌లోనూ దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. టెహ్రాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేసి చూపిస్తామన్నారు.ఇరాన్లో వైద్యుడికి ఉరి 2023 నుంచి జైలులో ఉంటున్న మెడికల్ డాక్టర్ ఇస్మాయిల్ ఫెక్రీకి ఇరాన్ అధికారులు సోమవారం ఉరిశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు అతడు సహరించినట్లు, ఇరాన్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు రుజువయ్యాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !Moments before the strike, they issued a evacuation warnings also TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025 -
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు.. అణు శాస్త్రవేత్తలు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తాజాగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది.ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడిలో టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులను ప్రారంభించిన తర్వాత జెరూసలేం- టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగించారు. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇజ్రాయెల్ సైన్యం ‘రైజింగ్ లయన్’ ప్రారంభించి, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ కొత్త దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాము జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు, నిపుణులు మృతిచెందారని పేర్కొంది. తాజా దాడులకు ముందు ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మాట్లాడుతూ ఈ దాడుల్లో 78 మంది మృతిచెందారని, 320 మందికి పైగా జనం గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ముప్పు తప్పేవరకూ ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో.. -
గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని స్కూల్ భవనంపై గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నారులు, 18 ఏళ్ల మహిళలున్నారని పాలస్తీనా వైద్య విభాగం తెలిపింది. ఘటనలో గాయపడిన మరో 42 మంది దగ్గర్లోని ఔదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ శరణార్థులు తలదాచుకుంటున్న స్కూల్ భవనాలపై దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన గాజాలోని హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 42 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు మృతి చెందారు. క్షతగాత్రులు లక్ష వరకు ఉంటారని అంచనా. తాము 17 వేల మంది హమాస్ మిలిటెంట్లను చంపేశామంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ సంబంధిత ఆధారాలను మాత్రం వెల్లడించడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య యుద్ధం కారణంగా గాజాలోని 23 లక్షల మందిలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆస్పత్రుల్లో మందుల కొరత ఉత్తర గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ చేస్తున్న దాడులతో నివాసాలు నేలమట్టమవుతున్నా యి. వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాదిగా నిరాశ్రయులవుతున్నారు. మళ్లీ బలం పుంజుకుంటున్న హమాస్ సాయుధులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. అయితే, ఈ దాడుల్లో గాయపడిన ఇంటెన్సివ్ కేర్‌లోని 14 మంది చిన్నారులు సహా సుమారు 150 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉత్తర గాజాలోని కమాల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ హొసమ్ అబూ సయేఫ్ తెలిపారు. వైద్య సిబ్బంది, మందుల కొరత కారణంగా గంటకొకరు చొప్పు న తుది శ్వాస విడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.ముగ్గురు లెబనాన్ సైనికులు మృతి బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం జరిపిన దాడిలో లెబనాన్ ఆరీ్మకి చెందిన ముగ్గురు చనిపోయారు. యటెర్ పట్టణంలో క్షతగాత్రులను తరలిస్తున్న ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు సిబ్బంది చనిపోయినట్లు ఆ దేశ ఆర్మీ ‘ఎక్స్’లో తెలిపింది. సెప్టెంబర్‌లో హెజ్»ొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య భీకర పోరు మొదలయ్యాక యటెర్పై దాడి జరగడం ఇది ఎనిమిదోసారని పేర్కొంది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు (ఫొటోలు)
-
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి... 10 మంది మృతి
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 10 మంది సిరియన్ దేశస్తులు ప్రాణాలు కోల్పోయారు. నబాటియే ప్రావిన్స్‌లోని వదీ అల్–కె¸ûర్‌పై ఈ దాడి జరిగింది. మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ఆయుధ డిపో లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ ప్రాంతంలో సామగ్రి తయారీ యూనిట్ ఉందని స్థానికులు తెలిపారు. బాధితులంతా సిరియా నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్నవారేనన్నారు. -
Israel-Hamas war: గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్–అల్–బలాహ్: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న అల్–తబీన్ స్కూల్‌పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా డజన్ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్‌తో 10 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. స్కూల్లోని హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ప్రకటనను హమాస్ ఖండించింది. దాడి తీవ్రతకు విశాలమైన ఆ పాఠశాల భవనం శిథిలాల దిబ్బగా మారి, గ్రౌండ్ ఫ్లోర్లో మొండిగోడలు మాత్రమే మిగిలున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. 100కు మృతదేహాలను స్థానికులు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ ఫదెల్ నయీమ్ చెప్పారు. స్కూలు భవనంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా హెచ్చరికల్లేకుండా ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు 6 వేల మంది తలదాచుకుంటున్న ఈ భవనంపై 3 క్షిపణులు పడ్డాయని అధికారులు చెప్పారు. చాలా మృతదేహాలు గుర్తు పట్టేందుకు కూడా వీలులేనంతా ఛిద్రమయ్యాయన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. -
Israel-Hamas war: ‘అల్–మగజి’పై అసాధారణ దాడులు
గాజా స్ట్రిప్: భీకర గగనతల, భూతల దాడులతో తలో దిక్కూ పారిపోతూ శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ క్షిపణులు కనికరం చూపడం లేదు. సోమవారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్–బాలాహ్ పట్టణం సమీపంలోని అల్–మగజి శరణార్ధి శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏకంగా 106 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు అంతస్తుల భవంతి పూర్తిగా నేలమట్టమైంది. భవన శిథిలాల నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరణాల సంఖ్య పెరగవచ్చని హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ మొదలయ్యాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. గాజా స్ట్రిప్‌లో మొత్తంగా గత 24 గంటల్లో 250 మంది మరణించారని, 500 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించనుందన్న వార్తలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. త్వరలోనే యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు. -
Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో అతి పెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. పెద్ద సంఖ్యలో రోగులు కన్ను మూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతోపాటు 7,000 మందికిపైగా సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడ ఉందన్న వాదనతో ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. నిత్యం తనిఖీలు చేస్తోంది. బయట నుంచి ఆహారం, నీరు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధనం, విద్యుత్ సరఫరా కాకుండా నిలిపివేసింది. గత ఐదారు రోజులుగా ఇక్కడ చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఐసీయూలోని రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి 22 మంది మరణించారని అల్–షిఫా డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాలి్మయా చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇక్కడి 50 మందికిపైగా రోగులు మరణించినట్లు సమాచారం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది మృత్యువాత పడ్డారన్నది తెలియరావడం లేదు. గత కొన్ని రోజులుగా మృతుల, క్షతగాత్రుల గణాంకాలను గాజా ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రభుత్వ అధికార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలమే ఇందుకు కారణం. బందీలను హత్య చేస్తున్న హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. ఇప్పటిదాకా నలుగురు బందీలను విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద బందీగా ఉన్న 19 ఏళ్ల నోవా మర్సియానో అనే ఇజ్రాయెల్ మహిళా జవానును ఇప్పటికే హత్య చేశారు. ఆమె మృతదేహం అల్–షిఫా వద్ద లభ్యమైంది. అలాగే 65 ఏళ్ల మరో మహిళా బందీ సైతం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని అల్–షిఫా వద్ద గుర్తించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆగని దాడులు.. అందని సాయం గాజాపై ఇజ్రాయెల్ సేనలు భీకరస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాలస్తీనియన్లకు మానవతా సాయం అందడం లేదు. దాడులకు విరామం ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆహారం, ఔషధాలు, నిత్యావసరాను గాజాకు చేరవేయలేకపోతున్నామని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆకలి చావులు ప్రారంభం కావడం తథ్యమని తేలి్చచెప్పింది. మరోవైపు గాజాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఊహించినదాని కంటే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, సాధారణ జనావాసాలతోపాటు ఆసుపత్రుల్లోనూ జనం రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఇతర దేశాల నుంచి ఇంధనం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో జనరేటర్లు పనిచేయడంలేదు. విద్యుత్ లేక మొబైల్ ఫోన్ల సేవలు సైతం నిలిచిపోయాయి. గాజాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గాజాను ఆక్రమించొద్దు: బ్లింకెన్ హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత గాజా పరిస్థితి ఏమిటి అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని, అక్కడ తన కీలు»ొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరోసారి ఇజ్రాయెల్‌కు సూచించారు. ఆఖరి గౌరవానికీ దూరం ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతçస్తులే. దాడుల్లో నిత్యం పదుల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. భవనాలు నేటమట్టమవుతున్నాయి. కాంక్రీట్ దిబ్బలుగా మారుతున్నాయి. చాలామంది వాటికింద చిక్కుకొని తుదిశ్వాస విడుస్తున్నారు. గాజాలో చాలా ప్రాంతాలు శ్మశనాలను తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై 5 వారాలు దాటింది. గాజాలో ఇప్పటివరకు 1,500 మంది చిన్నారులు సహా 2,700 మంది కనిపించకుండాపోయారు. వారంతా శిథిలాల కింద విగతజీవులైనట్లు తెలుస్తోంది. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. మృతులకు సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయాలి. మృతదేహాలను సబ్బుతో శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు చుట్టి, పన్నీరు చల్లి 24 గంటల్లోగా ఖననం చేయాల్సి ఉంటుంది. గాజాలో వేలాది మంది ఈ ఆఖరి గౌరవానికి నోచుకోవడం లేదు. బయటకు తీసేవారు లేక శిథిలాల కింద శవాలు కుళ్లిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నాయి కరెంటు, డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో గాజాలో సహాయక చర్యలు ఎప్పుడో నిలిచిపోయాయి. భవనాల శిథిలాలను తొలగించేవారే లేరు. కనిపించకుండాపోయిన తమ బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం జనం గాలిస్తున్నారు. శవం కనిపించినా ఎవరిదో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో హమాస్ సొరంగం.. అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో సొరంగంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న తన వాదనకు బలం చేకూర్చేలా వీడియోను, కొన్ని ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో గుహ లాంటి ప్రదేశం కనిపిస్తోంది. ఇది నిజంగా హమాస్ సొరంగమేనా? అనేది నిర్ధారించాల్సి ఉంది. అల్–షిఫా హాస్పిటల్లో హమాస్ ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అల్ షిఫా ఆస్పత్రి ఐసీయూ వార్డు (ఫైల్ ఫొటో) -
ఇజ్రాయిల్ వైమానిక దాడి: ఎనిమిది మంది మృతి
గాజా : గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ నగరంపై శనివారం ఇజ్రాయిల్ వైమానికి దాడి చేసింది. ఆ దాడిలో ఎనిమిది మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారని ఉన్నతాధికారి వెల్లడించారు. నగరంలోని నివాసంపై మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఖాన్ యూనిస్ నగరంలోని జనావాసాలపై దాడి చేయడంతో ఇళ్లలోని వారంతా చనిపోయారని చెప్పారు. గాజా నగరంపైపై ఇజ్రాయిల్ శుక్రవారం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో అయిదుగురు మరణించారని తెలిపారు.


