స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం పాక్షిక విజయం!  | SpaceX launch a partial success, booster lands in Gulf of Mexico | Sakshi
Sakshi News home page

స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం పాక్షిక విజయం! 

Nov 15 2026 5:16 AM | Updated on Nov 15 2026 5:16 AM

SpaceX launch a partial success, booster lands in Gulf of Mexico

సముద్రంలో పడి పేలిన బూస్టర్‌ 

నిరాఘాటంగా అంతరిక్షంలోకి నౌక 

నౌకను ఒడిసిపట్టే యత్నం త్వరలో

టెక్సస్‌: అంతరిక్ష ప్రయాణాన్ని, ప్రయోగాలను మరింత చౌక చేసేందుకు స్పేస్‌ ఎక్స్‌ చేసిన తాజా ప్రయత్నం పాక్షిక విజయం సాధించింది. రాకెట్‌ తొలిదశతోపాటు కక్ష్యలోకి ప్రవేశించే అంతరిక్ష నౌకను కూడా యంత్రాల సాయంతో ఒడిసిపట్టుకోవాలని అనుకున్నా భారీ సైజున్న రాకెట్‌ బూస్టర్‌ శుక్రవారం గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో పేలిపోయింది. అదే సమయంలో అంతరిక్ష నౌక మాత్రం సజావుగా పైకి ఎగసింది. శనివారం దీన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తున్నారు.  

అంతరిక్ష నౌకతో కూడిన రాకెట్‌ నింగిలోకి ఎగసిన కొంత సమయానికి తొలిదశ రాకెట్‌ బూస్టర్‌ వేరుపడింది. వాస్తవానికి ఇది తిరిగి ప్రయోగ వేదిక వద్ద అమర్చిన ప్రత్యేక యంత్రంలోకి చేరాలి. కానీ మార్గమధ్యంలోనే సముద్రంవైపు ప్రయాణించడం మొదలుపెట్టింది. అక్కడే పేలిపోయింది. అయితే ఈ ఘటన ప్రభావం అంతరిక్ష నౌకపై ఏమాత్రం పడలేదు. అది అంతరిక్షంవైపు దూసుకెళ్లింది. 

ఇరవై రెండు గంటల ప్రయాణం తరువాత మళ్లీ ప్రయోగ వేదిక వద్దకు రానుంది. అప్పుడు దాన్ని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాకెట్‌లోని అన్ని భాగాలను మళ్లీ మళ్లీ వాడుకునేలా పట్టుకోగలిగితే అంతరిక్ష ప్రయోగాలు చాలా వేగంగా సాగించవచ్చునని, జాబిల్లిపై శాశ్వత కేంద్రాల ఏర్పాటుతోపాటు ఇతర గ్రహాలపై మానవ ఆవాసాలకు సంబంధించిన ప్రయత్నాలను ముమ్మరం చేయవచ్చునని స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ భావిçస్తున్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పటివరకూ ఈ సంస్థ మూడుసార్లు బూస్టర్‌ను విజయవంతంగా పట్టుకోగలిగింది. శనివారం అంతరిక్ష నౌకను కూడా విజయవంతంగా ఒడిసిపట్టుకోగలిగితే అదో కొత్త రికార్డు కానుంది. తాజా ప్ర యోగంలో సముద్రంలో కూలిపోయిన బూస్టర్‌ పొడవు 236 అడుగులు కాగా, అంతరిక్ష నౌక సైజు 171 అడుగులు. ఇప్పటివరకూ జరిగిన 14 ప్రయోగాల్లో అంతరిక్ష నౌక భాగం ప్రతిసారీ సముద్రాల్లో కూలిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement