భారత్‌కు గుడ్‌న్యూస్‌.. GSLV F-18 రాకెట్‌ ప్రయోగం విజయవంతం | iSRO conducts a launch from Sriharikota GSLV soars into the sky | Sakshi
Sakshi News home page

భారత్‌కు గుడ్‌న్యూస్‌.. GSLV F-18 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

Oct 30 2026 11:54 PM | Updated on Oct 31 2026 12:26 AM

iSRO conducts a launch from Sriharikota GSLV soars into the sky

సాక్షి, తిరుపతి: శ్రీహరికోటలో ఇస్రో  చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతమయ్యింది. నావిగేషన్ వ్యవస్థ బలోపేతానికి ఎన్‌వీఎస్‌- 03 ఉపగ్రహన్ని నింగిలోకి ప్రయోగించింది. జీఎస్‌ఎల్‌వీ  రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. NVS ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీF-18 ద్వారా నింగిలోకి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం బరువు 2,232 కేజీలు.  ఎన్‌వీఎస్-03 (NVS-03) ఉపగ్రహం మన దేశీయ జీపీఎస్ వ్యవస్థను మరింత శక్తివంతం అవుతుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన ఎన్‌వీఎస్-03 (NVS-03) ఉపగ్రహం మన దేశీయ జీపీఎస్ (NavIC) వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తుంది. ఇందులో సాధారణ మొబైల్స్, స్మార్ట్‌వాచ్‌లలో నావిగేషన్ సేవలు సులభంగా అందేలా 'L1 సిగ్నల్' ఫ్రీక్వెన్సీని చేర్చారు. అంతేకాకుండా, గతంలో విదేశాల నుంచి తెచ్చుకున్న గడియారాలు పాడైపోవడంతో, ఈసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యంత ఖచ్చితమైన 'రుబీడియం అటామిక్ క్లాక్'ను ఇందులో అమర్చారు.

గత ప్రయోగాల లోపాల నుంచి నేర్చుకుని, భద్రతా చర్యగా రాకెట్ భూమిపై ఉన్నప్పుడే ఉపగ్రహ కవాటాలను (పైరో వాల్వ్స్) ముందే తెరిచి పంపడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. 12 ఏళ్ల సుదీర్ఘ జీవితకాలం కలిగిన ఈ ఉపగ్రహం, రక్షణ మరియు పౌర అవసరాల కోసం విదేశీ జీపీఎస్‌పై ఆధారపడే అవసరం లేకుండా భారతదేశానికి పూర్తి ఆత్మనిర్భరతను చేకూరుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement