రాహుల్ మాత్రం ‘ఓటు చోరీ’పై చర్చకు రారు: అమిత్ షా | Amit Shah Comments On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ మాత్రం ‘ఓటు చోరీ’పై చర్చకు రారు: అమిత్ షా

Oct 30 2026 8:54 PM | Updated on Oct 30 2026 8:57 PM

Amit Shah Comments On Rahul Gandhi

లక్నో: ‘ఓటు చోరీ’ ఆరోపణలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్‌లో చర్చకు ముందుకు రారని విమర్శించారు. తాజాగా లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. 

ఈ వేదికపై అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు పార్లమెంట్‌లోనే సమాధానం చెప్పుకోవాలని సవాల్ విసిరారు. సభలో చర్చించకుండా వీధుల్లో నిరసనలు, ఆందోళనలతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్, అఖిలేశ్‌లు ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంటే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం సొంతంగా ఏ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనలకు సిద్ధమైంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను బీజేపీకి అనుకూలంగా చేపడుతున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శనివారం ‘పబ్లిక్ ఇంపీచ్‌మెంట్’, ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాయి.

ఇదీ చదవండి: గ్యాస్, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారం.. విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement