‘ ఆ భూములు అమ్ముతామంటే మేం ఒప్పుకోం’ | TG BJP Chief Ramchander Rao Takes On Revanth Sarkar | Sakshi
Sakshi News home page

‘ ఆ భూములు అమ్ముతామంటే మేం ఒప్పుకోం’

Oct 30 2026 6:26 PM | Updated on Oct 30 2026 6:43 PM

TG BJP Chief Ramchander Rao Takes On Revanth Sarkar

హైదరాబాద్‌: మియాపూర్‌ భూములు ప్రభుత్వానికి చెందినవే అంటూ కోర్టు తీర్పు  వచ్చిన మరుక్షణమే, ఆ భూములను ఇప్పుడు ప్రభుత్వం అమ్ముతానంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఆ భూములను అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోమన్నారు రాంచందర్‌రావు. మియాపూర్‌ భూములను అమ్మడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 

‘మియాపూర్ భూములు అమ్మడానికి బీజేపీ వ్యతిరేకిస్తుంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వచ్చింది. ఐలా తీర్పు వచ్చిందో లేదో అలా అమ్ముతాం అంటూ సీఎం ప్రకటిస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. ఇంతకన్నా పెద్ద కష్ట కాలం వస్తే అప్పుడు ఏం అమ్ముతారు. భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపడం కరెక్ట్ కాదు. స్థానిక అభివృద్ధి, ఇతర అంశాలపై ఆలోచించకుండా డైరెక్ట్ అమ్ముతం అని చెపుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాంచందర్‌రావు.

ఇదీ చదవండి: కరువు పేరుతో ధరల దరువు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement