హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో భారీ వర్షం | Heavy rainfall Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో భారీ వర్షం

Oct 30 2026 6:23 PM | Updated on Oct 30 2026 6:56 PM

 Heavy rainfall Hyderabad

సాక్షి,  హైదరాబాద్‌ :  నగర వాసులను ఎట్టకేలకు  భారీ వర్షం పలకరించింది.  అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో శుక్రవారం(అక్టోబర్‌ 30వ తేదీ) సాయంత్రం సమయంలో నగరంలోని  పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి,,  హయత్‌గర్‌, ఎల్బీనగర్‌, పీర్జాదిగూడలో భారీ  వర్షం కురిసింది.  ఇంకా తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, మణికొండ, నాగారం తదితర ప్రాంతాల్లో కూడా భారీ  వర్షం పడుతోంది. అంతేకాకుండా ఈసీఐఎల్, కుషాయిగూడ, నేరేడుమెట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. 

పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులకు ఇబ్బందులెదుర్కొంటున్నారు.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో  భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రాబోయే ఐదారు రోజుల్లో తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. నవంబర్ 2- 4 మధ్య తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో వాన దంచికొట్టుడు.. రోడ్లన్నీ జలమయం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement