తెలంగాణలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు.. 9 సంస్థల లైసెన్సుల రద్దు | Telangana Food Safety Raids Nine Licenses Suspended | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు.. 9 సంస్థల లైసెన్సుల రద్దు

Oct 30 2026 1:01 PM | Updated on Oct 30 2026 1:24 PM

Telangana Food Safety Raids Nine Licenses Suspended

సాక్షి, తెలంగాణ: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో చేపట్టిన ఈ దాడుల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9 వ్యాపార సంస్థల లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

హరిప్రియ ప్రోడక్ట్స్‌, దయానంద్‌ ఐస్‌క్రీమ్స్‌, రాజు ఘీ స్వీట్స్‌, శ్రీకృష్ణ ఆయిల్‌ మిల్స్‌తో సహా మొత్తం 9 యూనిట్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే గంగా ఫుడ్‌, జీపీఆర్‌ ఫుడ్స్‌, స్వాగత్‌ స్వీట్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో లక్ష్మీ ఫుడ్స్‌, శివతార ఫ్లోర్‌ మిల్‌కు నిబంధనల ప్రకారం మార్పులు చేసుకోవాలని ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు ఇచ్చారు.

తనిఖీల్లో భాగంగా మొత్తం 5,555 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్‌ చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా నాణ్యతను పరిశీలించేందుకు 21 ఆహార నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల కోసం సంబంధిత ల్యాబ్‌లకు పంపించనున్నారు.

దీంతో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అయితే వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపార సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ చదవండి: ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు 79 శాతమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement