కడ్తాల్: యంగ్ ఎర్త్ లీడర్ 2025–26 వార్షిక పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఈ నెల 31న (శనివారం) అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్, సెబీ, ఎన్‌ఎస్‌ఈ–ఎస్‌ఎస్‌సీ సంస్థల ఉన్నతాధి కారులు, విద్యాశాఖ అధికారులు, పర్యావరణవేత్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ వైఈఎల్పీ పాఠశాలలు, ఉత్తమ మెంటర్స్ టీచర్స్, పర్యావరణ ఉపాధ్యాయులు, ఉత్తమ యంగ్ ఎర్త్ లీడర్స్ విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశాంసపత్రాలు అందించి సత్కరించనున్నట్లు చెప్పారు.
ఇబ్రహీంపట్నం: టీఎన్‌జీఓ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్, ఉపాధ్యక్షుడు రంగయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ మాధవ్‌గౌడ్, ట్రైజరర్ ఆనంద్‌సింగ్, జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్, ట్రెజరర్ గోపాల్, షాద్‌నగర్, రాజేంద్రనగర్ ఆమనగల్లు యూనిట్ నేతలు శ్రీనివాస శ్రీహరి, శ్రీలత, దార రాములు, అన్నపూర్ణ, శేఖర్, నగేష్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి స్వయంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం అవుతుందన్నారు. మానవత్వంతో, సామాజిక సేవ కర్తవ్యంగా భావించి పలువురు విద్యార్థులు రక్తదా నం చేయడం అభినందనీయమన్నారు. పోలీ సు అధికారులతోపాటు సుమారు 350 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ జితేందర్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మొయినాబాద్: నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. వారిని బీఆర్‌ఎస్ వైపు తిప్పుకొని పట్టభద్రుల ఓటరు నమోదు చేయించాలని బీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో గురువారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేసిందన్నారు. నిరుద్యోగుల ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, కృష్ణ, మాజీ సర్పంచ్ సుధాకర్‌యాదవ్, నాయకులు సురేందర్‌గౌడ్, తిరుపతిరెడ్డి, నర్సింహగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, సునీల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


