షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు కాయకల్ప పురస్కారం లభించింది. పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు సురక్షితమైన వైద్య సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆస్పత్రి సిబ్బందిని అభినందించి పురస్కారాలు అందజేశారు. వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో ఆస్పత్రికి గుర్తింపు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు మాధవి, స్వాతి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, అరుంధతి, లక్ష్మణ్, మహ్మద్ అలీఖాన్ పాల్గొన్నారు.


