షాద్‌నగర్: కాలుష్యం బారి నుంచి కాపాడాలని డిమాం డ్‌చేస్తూ ఫరూఖ్‌నగర్ మండలం కందివనం గ్రామస్తులు మొగిలిగిద్ద శివారులో ఉన్న ఓం శివశక్తి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఎదుట చేపట్టిన ధర్నా గురువారం రెండో రోజు కొనసాగింది. గ్రామస్తులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పరిశ్రమ ఎదుట భైఠాయించారు. పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యంతో చౌలపల్లి, కందివనం, గుండెగానితండా, పిట్టలగడ్డతండా, మొగిలిగిద్ద గ్రామాలు మసకబారుతున్నాయని, రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. తమ ప్రాణాలు, పర్యా వరణాన్ని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమ యజ మానులపై ఎందుకు చర్యలు చేపట్టడం ప్రశ్నించారు. పరిశ్రమను మూసి వేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ధర్నాకు బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కాగా స్పాంజ్ ఐరన్ పరిశ్రమను షాద్‌నగర్ ఆర్డీఓ సరిత, ఫరూఖ్‌నగర్ తహిసీల్దార్ నాగయ్య పరిశీలించారు. ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి వెంటనే ఉత్పత్తి పనులు నిలిపివేయాలని ఆదేశించారు. సమగ్ర పరిశీలన చేసి నివేదికను కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అందించాలన్నారు.


