కుటుంబ అనుబంధాలు, పిల్లలు, తల్లిదండ్రుల మధ్య స్నేహాన్ని ప్రతిబింబించే కథాంశాలతో రూపొందుతున్న చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’.
వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై డి. దీపక్ నిర్మాణంలో శరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బేబీ పరిణిత రుద్రరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను గురువారం విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


