దక్షిణాదిలో గోద్రెజ్‌ వెల్త్‌ విస్తరణ | Godrej Wealth Opens New Office In Hyderabad, Strengthens South India Presence With Expansion Plans Across Eight Cities | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో గోద్రెజ్‌ వెల్త్‌ విస్తరణ

Oct 30 2026 1:39 PM | Updated on Oct 30 2026 2:26 PM

Godrej Wealth Enters Hyderabad Boosts South India Expansion Plans

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లో భాగమైన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవల సంస్థ గోద్రెజ్‌ వెల్త్‌ దక్షిణాదిలో తమ కార్యకలాపాలు విస్తరించింది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. గోద్రెజ్‌ వెల్త్‌ ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ, పుణేలో విస్తరించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 8 నగరాలను లక్ష్యంగా పెట్టుకుంది.

దేశీయంగా అత్యంత సంపన్నుల్లో (యూహెచ్‌ఎన్‌ఐ) 6.3% మందికి, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నిపుణులకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనీష్‌ షా, సీబీవో నీరజ్‌ వెల్లడించారు. సుమారు రూ. 5 కోట్ల పైబడి పెట్టుబడులు పెట్టగలిగే సంపన్నులకు.. వారి రిస్క్‌ సామర్థ్యాలను బట్టి వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రూ. 3,000 కోట్లు, 2031 నాటికి రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు), 35 ప్రాంతాల్లో కార్యకలాపాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మనీష్‌ షా వివరించారు. మరోవైపు విజయవాడకు చెందిన కనకదుర్గా ఫైనాన్స్‌ బంగారం రుణాల వ్యాపారం కొనుగోలు ప్రక్రియ పూర్తి కావొస్తోందని చెప్పారు. పసిడి రుణాల పోర్ట్‌ఫోలియోను రూ. 500 కోట్లకు పెంచుకోనున్నట్లు షా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement