నిమ్స్‌ ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ తనిఖీలు | ACB raids NIMS Hospital once Again | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ తనిఖీలు

Oct 29 2026 9:42 PM | Updated on Oct 29 2026 9:42 PM

ACB raids NIMS Hospital once Again

(ఫైల్‌ఫోటో)

హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్‌  ఆసుపత్రిలో మరోసారి ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్యాంటీన్‌తో పాటు  మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు వెళ్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. మెడికల్ స్టోర్స్ క్యాంటీన్ లో నుంచి రూ. 50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్లినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.

గత నెలలో నిమ్స్‌ ఆస్పత్రిలో భారీ అవినీతి వెలుగు చూడటంతో.. నిమ్స్‌ పరిపాలనా విభాగంలో రికార్డులను ఏసీబీ అధికారులు మరొకసారి పరిశీలిస్తున్నారు. ఒకవైపు నిమ్స్ క్యాంటీన్‌లో నలుగురు అధికారులు తనిఖీలు చేపట్టగా, మరొకవైపు సర్జికల్ స్టోర్‌లో మందులు, పరికరాల నిల్వలను మరో నలుగురు అధికారుల బృందం తనిఖీలు చేసింది. ఏకకాలంలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:  నిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా ఏసీబీ సోదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement