సాక్షి,హైదరాబాద్ : మాజీ మంత్రి కొండా సురేఖ ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘నిజం నిలకడగా తేలుతోంది. మొన్న ఓ పేపర్ కూడా క్షమాపణ చెప్పింది. మాపై చాలామంది తప్పుడు ఆరోపణలు చేశారు. క్షమాపణలు చెప్పేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో ఇంకా చూడలేదు’అని వ్యాఖ్యానించారు.
అంతకముందు కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ కొండా సురేఖట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.
కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.
ఇదీ చదవండి : కేటీఆర్‌కు క్షమాపణ.. కొండా సురేఖ కీలక ట్వీట్


