రైలు ‘రచ్చ’ | Telangana Congress Special Train Protest Delhi | Sakshi
Sakshi News home page

రైలు ‘రచ్చ’

Oct 29 2026 1:07 PM | Updated on Oct 29 2026 1:37 PM

Telangana Congress Special Train Protest Delhi

రైల్‌ నిలయం వద్ద ధర్నా చేస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్, పొన్నం, శ్రీగణేశ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌తదితరులు

నవంబర్‌ 1న కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ కార్యక్రమానికి ప్రత్యేక రైలు ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే నిరాకరణ

జీఎంను కలిసేందుకు ఎంపీలతో కలిసి రైలు నిలయం వెళ్లిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

అడ్డుకున్న పోలీసులు.. మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలు

బస్సుల్లో పార్టీ నేతలను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీపీసీసీ

సాక్షి, హైదరాబాద్‌/అడ్డగుట్ట/రాంగోపాల్‌ పేట్‌: ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ నిర్వహించ తలపెట్టిన ఓట్‌ బచావో–దేశ్‌ బచావో ఆందోళనకు వెళ్లడా నికి టీపీసీసీ అడిగిన ప్రత్యేక రైలు వ్యవహా రం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ నెల 22వ తేదీన ప్రత్యేక రైలు కోసం టీపీసీసీ దరఖాస్తు చేసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ దరఖాస్తును 27వ తేదీన తిరస్కరించారు.

రైళ్లు అందుబాటులో లేనందున ప్రత్యేక రైలు ఇవ్వలేమంటూ చెప్పారు. దీనిని నిరసిస్తూ బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు రైల్‌ నిలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. జీఎం కార్యాలయం ఎదుట జరిగిన ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్‌ బి.మహేశ్‌ కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్‌ యాదవ్, శ్రీగణేశ్, ఎంపీ రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్‌ జాన్‌లతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని మోండా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ప్రత్యేక రైళ్ల కోసం రైల్వే జీఎంకు పార్టీ ఎంపీలు ఆరు రోజుల క్రితం దరఖాస్తు చేశారని చెప్పారు.

కాలయాపన చేసిన అధికారులు చివరి నిమిషంలో రైళ్లు ఇవ్వలేమంటూ ఉద్దేశ పూర్వకంగా నిరాకరించారని ఆరోపించారు. అమిత్‌షా సూచనల మేరకు దక్షిణాది నేతలు ఢిల్లీ నిరసన కార్యక్రమానికి రాకుండా అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని, రైల్‌ కోసం వెళితే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

అనుబంధ సంఘాల నేతలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌
ఢిల్లీ నిరసన కార్యక్రమంపై బుధవారం ఉదయం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవిలతో కలిసి పార్టీ అనుబంధ సంఘాల నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ జూమ్‌ సమావేశం నిర్వహించారు. రైళ్లకు అనుమతి నిరాకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని, రైలు లేకపోయినా ఢిల్లీ వెళ్లేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ బస్సుల్లో వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకుగాను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లురవి, బలరాం నాయక్, చామల కిరణ్‌లతో కమిటీ వేసినట్టు చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీ అందోళనకు తరలివెళ్లి తెలంగాణ సత్తా చాటాలని మహేశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: తొలుత హేతుబద్ధీకరణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement